Purandeswari As Lok Sabha Speaker: లోక్ సభ స్పీకర్ గా పురంధేశ్వరి.. చిన్నమ్మ విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం..

Purandeswari As Lok Sabha Speaker: ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుందా.. ? ఆమెకు లోక్ సభ స్పీకర్ పదవి కట్టబెట్టనుందా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 9, 2024, 06:03 PM IST
Purandeswari As Lok Sabha Speaker: లోక్ సభ స్పీకర్ గా పురంధేశ్వరి.. చిన్నమ్మ విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం..

Purandeswari As Lok Sabha Speaker:  ఏపీ బీజేపీ ఛీఫ్ పురంధేశ్వరికి 18వ లోక్ సభ స్పీకర్ గా బాధ్యతలు అప్పగించనున్నారా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ బీజేపీ వర్గాలు. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో బీజేపీ,టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పాటులో పురంధేశ్వరి కీలక భూమిక పోషించింది. ఈ ఎన్నికల్లో పురంధేశ్వరి రాజమండ్రి లోక్ సభ నుంచి వైసీపీ అభ్యర్ధి గూడురు శ్రీనివాస్ చేతిలో 2,39,139 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ రోజు జరగబోయే ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారంతో పాటు కేంద్ర మంత్రులుగా ఏపీ నుంచి పురంధేశ్వరి పేరు ఖాయంగా వినిపించింది. కానీ అనూహ్యంగా ఏపీ నుంచి తెలుగు దేశం పార్టీ తరుపున కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ లకు క్యాబినేట్ బెర్త్ లు కన్ఫామ్ అయ్యాయి. కానీ చివరి నిమిషయంలో   నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు క్యాబినేట్ లో చోటు దక్కినట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు కేంద్ర నాయకత్వం నుంచి ప్రమాణ స్వీకారానికి రమ్మని ఫోన్లు కూడా వచ్చాయి. దీంతో వీళ్లు కేంద్ర కేబినేట్ లో ప్రమాణం చేయడం దాదాపు ఖాయమైంది.

కానీ ఏపీ పురంధేశ్వరికి మాత్రం అనూహ్యంగా లోక్ సభ స్పీకర్ పదవి వరించబోతున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అన్న ఎన్టీఆర్ కూతురిగా సుపరిచితురాలైన చిన్నమ్మ.. అప్పట్లో అన్న ఎన్టీఆర్ గారికి ఆమె స్వయంగా ప్రసంగాలు రాసిచ్చేవారని చెబుతారు. అన్నగారు ఉన్నంత వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న పురంధేశ్వరి.. 2004లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని .. బాపట్ల నుంచి 14వ లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత డీ లిమిటేషన్ లో అది ఎస్సీ రిజర్వ్ స్థానం కావడంతో 2009లో విశాఖ పట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్ లో అడుగుపెట్టారు.

అంతేకాదు 2006లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మానవ వనరులు శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఏపీ విభజన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో రాజంపేట నుంచి బీజేపీ తరుపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2024లో రాజమండ్రి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. తాజాగా లోక్ సభ స్పీకర్ గా పురంధేశ్వరి ఎన్నిక లాంఛనమే  అయితే.. అనంత శయనం అయ్యంగార్, నీలం సంజీవ్ రెడ్డి, జీఎంసీ బాలయోగి తర్వాత ఆ పదవి చేపట్టబోతున్న నాల్గో తెలుగు వ్యక్తిగా రికార్డులకు ఎక్కుతారు. అంతేకాదు మీరా కుమార్, సుమిత్రా మహాజన్ ల తర్వాత మూడో మహిళా స్పీకర్ గా నిలుస్తారుపురంధేశ్వరి. మొత్తంగా చూసుకుంటే 18వ లోక్ సభలో 18వ స్పీకర్ గా  ఆమె ఎన్నిక అవుతారా లేదా అనేది వెయిట్ అండ్ సీ.

పురుంధేశ్వరి కుటుంబ నేపథ్యం విషయానికొస్తే..  ఈమె 22 ఏప్రిల్ 1959లో ఎన్టీఆర్, బసవతారకంలకు  జన్మించారు.  ఈమె విద్యాబ్యాసం మొత్తం  చెన్నైలో జరిగింది. ఈమె అన్నగారి సంతానంలో 8 మంది కుమారులు.. నలుగురు కూతుళ్లలో  రెండో ఆమె. బీఏ ఆర్ట్స్ లో సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరియు కాలేజ్  నుంచి పట్టభద్రులయ్యారు. పురంధేశ్వరికి ఐదు భాషల్లో అనర్ఘలంగా చదవగలదు. మరియు రాయగలదు. ఈమె 1979లో మే 9న దగ్గుబాటి వెంకటేశ్వరరావును వివాహాం చేసుకున్నారు. వీరికి నివేదిత, హితేష్ చెంచురామ్ సంతానం.

ఇదీ చదవండి:ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం.. రామోజీరావుపై మెగాస్టార్ ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News