Double iSmart Update: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా కి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ అసలు మళ్ళీ సినిమా తీస్తారా లేదా అని కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
కానీ పూరి జగన్నాథ్ మాత్రం తన సూపర్ హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్ సినిమాని ప్రకటించి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాతో కచ్చితంగా పూరి జగన్నాథ హిట్ అందుకుంటారు అని అందరూ అనుకున్నారు. సినిమా ప్రకటించి చాలాకాలం అయింది కానీ షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. పైగా డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి కూడా పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మిస్తున్నారు. లైగర్ సినిమా విషయంలో పూరి జగన్నాథ్ బోలెడన్ని నష్టాలు ఎదుర్కొన్నారు. సినిమా కారణంగా ఎన్నో కోట్లు నష్టపోయిన పూరి జగన్నాథ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని.. అందుకే డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాని ముందుకు తీసుకెళ్ల లేకపోతున్నారు అని వార్తలు వినిపించాయి.
దానికి తగ్గట్టుగానే.. చాలాకాలం పాటు సినిమా హోల్డ్ లో ఉండిపోయింది. అసలు ఈ సినిమా మళ్లీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా.. అని అభిమానులు చర్చించుకుంటున్న సమయంలో.. పూరి జగన్నాథ్ సైలెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ ని పూర్తి చేస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి.
ముంబైలో ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ మొదలైందని చిత్ర బృందం కూడా అధికారికంగా ప్రకటించింది. రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్ ని కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా మళ్ళీ మొదలవడంతో పూరి జగన్నాథ్ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
అయితే లైగర్ సినిమా విషయంలో బోలెడన్ని నష్టాలను ఎదుర్కొన్న పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా విషయంలో మాత్రం కావాలని కాస్ట్ కట్టింగ్ చేస్తున్నారని.. ఆ విధంగా సినిమా బడ్జెట్ కొంచెం తగ్గిస్తున్నారని తెలుస్తోంది. అందుకే సినిమాని మళ్లీ మొదలు పెట్టారని టాక్ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఆగస్టు లేదా సెప్టెంబర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరి లైగర్ సినిమాతో వచ్చిన నష్టాలను పూరి జగన్నాథ్ ఈ సినిమాతో తీర్చగలరో లేదో చూడాలి.
Also Read: Himanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter