Raghava Lawrence: స్టేజ్ పైకి వచ్చిన అభిమానికి అనుకోని ట్విస్ట్.. కాళ్లపై పడిన లారెన్స్

Jigarthanda DoubleX pre release event: తమ అభిమానులను విపరీతంగా ఇష్టపడే నటులలో రాఘవ లారెన్స్ ఒకరు. ఆయన అభిమానులతో సొంత మనిషిలాగా కలిసిపోతూ ఉంటాడు. తన అభిమానుల కోసం ఎన్నో సహాయ పనులు కూడా చేస్తూ ఉండే రాఘవ లారెన్స్ తాజాగా తన సినిమా జిగర్తాండ డబల్ ఎక్స్ ఈవెంట్ లో చేసిన ఒక పని వైరల్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2023, 09:12 AM IST
Raghava Lawrence: స్టేజ్ పైకి వచ్చిన అభిమానికి అనుకోని ట్విస్ట్.. కాళ్లపై పడిన లారెన్స్

Raghava Lawrence: మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది వదగమని అర్థం అందులో ఉంది.. అనే పాటకు నిర్వచనం రాఘవ లారెన్స్. ఎంత ఎదిగినా కానీ ఆయన అభిమానులతో సాధారణమైన మనిషిలాగ కలిసిపోతూ ఉంటారు ఈ హీరో కమ్ డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్. సేవా గుణం కూడా ఈయనకి ఎక్కువే. ఆయన ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది వికలాంగులకు ఎన్నో సహాయాలు చేశాడు.

అందుకే ఆయన సినిమాల వల్లే కాకుండా వ్యక్తిత్వం వల్ల కూడా లారెన్స్ ని చాలామంది అభిమానిస్తూ ఉంటారు. తాజాగా ఈయన చేసిన మరొక పని అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈమధ్య ఏదైనా ఈవెంట్స్ జరుగుతూ ఉంటే.. వెంటనే అభిమానులు స్టేజ్ ఎక్కి తమ అభిమాన హీరోలను దగ్గరకు వెళ్లి కలవాలి అని ఆత్రుత పదడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇలా ఏ అభిమాని హీరో చేసిన.. వెంటనే ఆ హీరో బౌన్సర్లు వచ్చి వాళ్లను తీసుకెళ్లి పోతూ ఉంటారు. కొన్నిసార్లు అయితే ఏకంగా హీరోలు కూడా ఆ అభిమానులను కసురుకోవడం చూసాం. ఇప్పుడు ఇలానే లారెన్స్ కి జరగగా.. ఆయన చేసిన పని మాత్రం అందరూ అభినందించేలా మారింది.

అసలు విషయానికి వస్తే నిన్న లారెన్స్, ఎస్జె సూర్య హీరోలగా చేసిన జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.  కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.

వేదికపై లారెన్స్ మాట్లాడుతుండగా.. ఆయన అభిమాని ఒకరు వెంటనే లారెన్స్ పైకి దూసుకుని వచ్చారు. ఇక లారెన్స్ వైపు దూసుకుని వచ్చి ఆ అభిమాని లారెన్స్ కాళ్ల పైన కూడా పడిపోయారు. 

ఇక తన మీదికి దూసుకుని వస్తున్న అభిమానిని చూసి వెంటనే లారెన్స్ ‘ఏంటమ్మా’ అని అడిగారు. కాళ్లపై పడుతుంటే.. వద్దు వద్దని.. తిరిగి తన అభిమాని కాళ్లకి నమస్కారం చేసేశారు లారెన్స్. ఇది చూసి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. బౌన్సర్లు అతనిపైకి దూసుకొస్తుండగా.. ఆగండి అని ఆపేశారు లారెన్స్. అంతేకాదు తన కాళ్ల పైన పడిన తరువాత అతనిని దగ్గరికి తీసుకొని అతను చెప్పేదంతా ప్రశాంతంగా విన్నారు. ఆ తరువాత ఆ అబ్బాయి చెప్పిన దాన్ని అందరికీ చెపుతూ.. ‘ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే.. నేను మా అమ్మకి గుడికట్టాను కదా.. అలానే అదే విషయాన్ని ప్రేరణ గా తీసుకొని తన గుండెలపై తల్లి పచ్చబొట్టుని పొడిపించున్నాడట’ అంటూ అతని గుండెలపై ఉన్న అమ్మ పచ్చబొట్టుని చూపించారు లారెన్స్. చాలా సంతోషం.. అంటూ తన అభిమానిని దగ్గరకు తీసుకుని బుగ్గపై ముద్దు కూడా పెట్టేశారు.
ఇక ఇది చూసిన వారంతా లారెన్స్ కి ఫిదా అయిపోయారు.

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. డీఏ పెంపు కొత్త లెక్కలు ఇలా..!  

Also Read: Free Ration Scheme: రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు పొడగింపు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News