Manobala Death : మనోబాల మరణం.. కసూర్తి, రాధిక, జయం రవి, కార్తీ, రజనీ ఎమోషనల్

Rajinikanth Condolences to Manobala తమిళ కమెడియన్, డైరెక్టర్ మనోబాలా నేడు కన్నుమూశారు. లివర్ సమస్యలతో ఆయన మరణించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన మరణం పట్ల కోలీవుడ్‌ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సూపర్ స్టార్ తలైవా నుంచి ప్రతీ ఒక్కరూ స్పందిస్తున్నారు. సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2023, 03:30 PM IST
  • కోలీవుడ్‌లో నెలకొన్న విషాదం
  • నటుడు, డైరెక్టర్ మనోబాల మరణం
  • స్పందించిన రజని, రాధిక, కార్తీ
Manobala Death : మనోబాల మరణం.. కసూర్తి, రాధిక, జయం రవి, కార్తీ, రజనీ ఎమోషనల్

Manobala Passed Away తమిళ ప్రముఖ దర్శకుడు, నటుడు మనోబాలా (69) బుధవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హాస్పిటల్‌లో ఉన్న ఆయన కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆయన చివరకు స్వర్గస్తులయ్యారు. ఆయన మరణం పట్ల కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్, రాధిక, కస్తూరీ శంకర్, జయం రవి, కార్తీ వంటి వారంతా సోషల్ మీడియాలో సంతాపాన్ని ప్రకటించారు.

ప్రముఖ దర్శకుడు, నటుడు, నా ప్రియ మిత్రురాలు మనోబాల మరణించడం నాకెంతో బాధను కలిగించింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని రజినీ ట్వీట్ చేశాడు. ఇక చాలా మంది RIP Manobala అంటూ హ్యాష్ ట్యాగ్‌లో హార్ట్ బ్రోకెన్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.

నా గుండె బద్దలైనట్టుగా ఉంది.. ఈ రోజు ఉదయమే ఫోన్ చేసి.. ఎక్కడున్నారు.. ఎలా ఉన్నారు.. అని కనుక్కున్నాన.. వెళ్లి చూసి వద్దామని అనుకున్నాను.. కానీ ఇంతలోనే ఇలా జరిగింది.. నమ్మలేకపోతోన్నాను.. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అతనితో ఎన్నో మధుర క్షణాలున్నాయి.. ఈ జర్నీలో మేం ఇద్దరం ఎంతో నేర్చుకున్నాము, ఎంతో నవ్వుకున్నాము, ఎంతో పోరాడాము, కలిసి భోజనం చేశాం.. చాలా విషయాల గురించి సుదీర్ఘ సంభాషణలు చేశాం, అతను ప్రతిభావంతుడు, ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా నిలబడగల వ్యక్తి.. అతన్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం.. అని రాధిక ఎమోషనల్ అయింది.

Also Read:  Manobala Death : ఇండస్ట్రీలో విషాదం.. నటుడు మనోబాల మృతి

మనోబాల సర్ మరణించారనే వార్త తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యాను.. ప్రతీ చోటా.. ప్రతీ వ్యక్తి కోసం నిలబడగల ఏకైక వ్యక్తి.. ఆయన్ను ఎప్పటికీ మిస్ అవుతాను అని కార్తీ ట్వీట్ వేశాడు. మాటల్లో ఈ బాధను చెప్పలేకపోతోన్నాను.. ఆయన ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి అని జయం రవి ట్వీట్ చేశాడు.

Also Read:  Aadi Sai Kumar Wife : ఇలా కూడా ఉంటారా?.. ఆది సాయి కుమార్ భార్య కోరిక, కల ఇదేనట

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x