RGV - Draupadi Murumu: ద్రౌప‌ది ముర్మును వివాదాస్పద ట్వీట్ చేసి డిలీట్ చేసిన వర్మ.. మళ్లీ పొగుడుతూ!

Ram Gopal Varma - Draupadi Murumu:  వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ద్రౌప‌ది ముర్మును పొగుడుతూ ట్వీట్ చేశాడు. అయితే అంతకు ముందు ఆయన వెటకారంగా మాట్లాడుతూ చేసిన ట్వీట్ ను డిలీట్ చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2022, 10:06 AM IST
  • ద్రౌప‌ది ముర్మును పొగుడుతూ వర్మ ట్వీట్
  • వెటకారంగా చేసిన ట్వీట్ డిలీట్
  • సోషల్ మీడియాలో చర్చ
RGV - Draupadi Murumu: ద్రౌప‌ది ముర్మును వివాదాస్పద ట్వీట్ చేసి డిలీట్ చేసిన వర్మ.. మళ్లీ పొగుడుతూ!

Ram Gopal Varma Targets Draupadi Murumu: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక వివాదానికి కారణమై వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. అందులో భాగంగా తాజాగా ఎన్డీఏ పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పేరు ప్రకటించిన నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ సంచలనానికి కారణమైంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము పేరును ప్రకటించిన క్రమంలో ఆర్జీవీ స్పందిస్తూ.. 'ద్రౌపది రాష్ట్రపతి అయితే.. పాండవులు ఎవరు..? ఇంకా ముఖ్యమైన విష‌యం ఏంటంటే కౌర‌వులు ఎవ‌రు..?' అంటూ వివాదస్పద రీతిలో ట్వీట్ చేశారు. ఒక గిరిజన ఆదివాసీ మహిళను ఇలా ఎలా అవమానిస్తాడు అంటూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. 

ఇప్పటికే బీజేపీ నేతలు ఆయన మీద ఫైర్ అవుతుండగా కొన్నిచోట్ల ఆదివాసీలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.ముందు చిన్నగా మొదలైన వివాదం తర్వాత  మరింత ముదురుతుండడంతో ఆర్జీవీ వెన‌క్కి త‌గ్గాడు. ద్రౌప‌ది అనే పేరు విన‌గానే తనకు మ‌హాభార‌తంలో పాత్రలు గుర్తుకువ‌చ్చాయని.. ఎవ‌రినీ కించ ప‌రిచే ఉద్దేశం లేదంటూ వివరణ ఇచ్చుకున్నాడు. అయితే ఇదిలా ఉండగా తాజాగా ద్రౌప‌ది ముర్మును పొగుడుతూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు.

 'అత్యంత గౌరవనీయమైన ద్రౌపది గారు ప్రెసిడెంట్‌గా ఉంటే.. పాండవులు, కౌరవులు ఇద్దరూ తమ యుద్ధాన్ని మరచిపోయి.. కలిసి ఆమెను ఆరాధిస్తారని, ఈ క్రమంలోనే కొత్త భారతదేశంలో మహాభారతం తిరిగి రాయబడుతుందని చెప్పుకొచ్చారు. ఇండియాను చూసి ప్రపంచం గర్విస్తుందన్న ఆయన జై బీజేపీ..' అంటూ ఆసక్తికర రీతిలో ట్వీట్ చేశారు. ద్రౌపది జీ ప్రపంచం మొత్తంలో ఎప్పటికీ గొప్ప రాష్ట్రపతి అవుతారనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని అంటూనే బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు వర్మ. 

అయితే ఆమె గురించి, ఆమె పళ్ళను టార్గెట్ చేస్తూ వర్మ వెటకారంగా చేసిన ట్వీట్ మాత్రం డిలీట్ చేశాడు. ఇక రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం మీద వర్మ యూటర్న్ తీసుకున్నాడు అని కొందరు అంటుంటే వర్మ మాటల్లో ఇంకా వెటకారం కనిపిస్తోంది తప్ప, ఎక్కడా కూడా ఆయన రాష్ట్రపతి అభ్యర్థిని గౌరవించినట్లు కనిపించడం లేదని కొందరు అంటున్నారు. ఏదేమైనా వర్మ వ్యవహార తీరు చర్చనీయాంశం అవుతోంది. 
Also Read: Prabhas's Salar: ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో మరో స్టార్ హీరో.. ఎక్కడా తగ్గట్లేదుగా!

Also Read: SP Charan-Sonia Agarwal: హీరోయిన్తో ఫోటో వైరల్‌.. పెళ్లి వార్తలు రావడంతో షాకిచ్చిన సింగర్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News