Balakrishna-Ram: నందమూరి హీరోతో రామ్ పోతినేని.. మల్టీస్టార్లర్ లో ఆ కన్నడ హీరో సైతం..!

NBK 109: ఇప్పుడు టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలు తీయడం బాగా ట్రెండింగ్ గా ఉంది. 90 దశకంలో మల్టీస్టార్ చిత్రాలు.. ఎక్కువగా ఉండేవి. అయితే ఆ తర్వాత క్రమంగా వీటి ఆదరణ తగ్గిపోయింది. కాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి ఈ తరం వారు కూడా మల్టీ స్టార్లర్ వైపు మగ్గుచూపుతో వస్తున్నారు. ఇక తిరిగి మళ్లీ ట్రెండింగ్ లో ఉన్న మల్టీస్టార్ కాన్సెప్ట్.. ఇపుడు బాలయ్య కూడా ఫాలో అవ్వబోతున్నారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 4, 2024, 03:01 PM IST
Balakrishna-Ram: నందమూరి హీరోతో రామ్ పోతినేని.. మల్టీస్టార్లర్ లో ఆ కన్నడ హీరో సైతం..!

Balakrishna - Ram: ఒకప్పుడు మల్టీస్టార్లర్ చిత్రాలు టాలీవుడ్ లో చాలా ఎక్కువగా వచ్చేవి. అయితే ఆ తర్వాత సోలో హీరో ఓరియంటెడ్ చిత్రాలకు ప్రాముఖ్యత పెరగడంతో… మల్టీస్టార్లర్లు మెల్లగా కనుమరుగైపోయాయి. మళ్ళీ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..తర్వాత ఈ ట్రెండ్ బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో తిరిగి మెల్లిగా టాలీవుడ్ లో అగ్ర హీరోలు.. మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. 

గతంలో పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన గోపాల గోపాల దగ్గర నుంచి రీసెంట్గా ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్.. వరకు మల్టీ స్టార్లర్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా బాగా రాబట్టాయి. 

అయితే తాజాగా నందమూరి అందగాడు బాలకృష్ణ కూడా మల్టీ స్టార్లర్.. చిత్రానికి సిద్ధపడ్డాడు. బాలయ్య నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో.. రామ్ పోతినేని కూడా నటించబోతున్నాడు అని టాక్. గతంలో రామ్ పోతినేని.. వెంకటేష్ తో కలిసి.. మసాలా అనే చిత్రంలో నటించాడు. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్..సొంతం చేసుకుంది. ఇప్పుడు రామ్.. బాలయ్యతో కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం అతని కెరీర్ కి చాలా ఇంపార్టెంట్. 

రామ్ పోతినేని చివరిగా నటించిన స్కందా.. చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం అతను డబల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రం.. రామ్ పోతినేని కెరీర్ కు మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ కూడా అతని ఖాతాలో ఓ భారీ సక్సెస్ ని నమోదు చేస్తుందని అతని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్యతో సినిమా అంటే.. అది అతని కెరీర్ కి మంచి బూస్టింగ్ ఇస్తుంది అని.. అందుకే రామ్ ఈ చిత్రాన్ని ఒప్పుకుంటునట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 

రామ్ పోతినేని బాలయ్య కాంబోలో రాబోతున్న చిత్రంలో మరొక స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అతను మరెవరో కాదు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్. ఈ హీరో కూడా బాలయ్య మల్టీ స్టార్లర్ చిత్రంలో భాగం కాబోతున్నారు. రజనీకాంత్ నటించిన జైలర్ మూవీలో.. శివరాజ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. దీంతో బాలయ్య మూవీలో శివరాజు నటిస్తున్నాడు.. అన్న వార్త వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ మూవీ కచ్చితంగా ట్రెండ్ సెట్టర్ అవుతుంది అని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ మూవీ ని బోయపాటి శీను లేదా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఫేమ్ పి.మహేష్ బాబు  తెరకెక్కించే అవకాశం ఉందని టాక్.

Read more:Snake vs Lizard: మానిటర్ బల్లిని కసితీరా కాటు వేసిన నల్ల పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News