Comedian Harsha Chemudu : పెళ్లై ఏడాది.. కాశ్మీర్ లోయలో సందడి.. భార్యతో కమెడియన్ హర్ష ట్రిప్

Comedian Harsha Chemudu కమెడియన్ హర్ష తాజాగా తన భార్యతో కలిసి కాశ్మీర్ లోయలో సందడి చేస్తున్నాడు. పెళ్లై ఏడాది అయిన సందర్భంగా ఇలా వెకేషన్ ప్లాన్ చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2022, 12:42 PM IST
  • నెట్టింట్లో కమెడియన్ హర్ష సందడి
  • భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న కమెడియన్
  • కమెడియన్ హర్ష పిక్స్ వైరల్
Comedian Harsha Chemudu : పెళ్లై ఏడాది.. కాశ్మీర్ లోయలో సందడి.. భార్యతో కమెడియన్ హర్ష ట్రిప్

Comedian Harsha Chemudu Wife : యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు ఎంతో మంది ఎదిగారు. షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ చిన్నా చితకా గుర్తింపు తెచ్చుకున్న వారు ఇప్పుడు వెండితెరపై స్టార్లుగా రాణిస్తున్నారు. అందులో కమెడియన్ హర్ష ఒకరు. అయితే హర్షకు ప్రస్తుతం మంచి క్రేజ్ వచ్చేసింది. ఆయన నటిస్తోన్న చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయి. దీంతో హర్షకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది.

కలర్ ఫోటో సినిమా రాక ముందు హర్ష చెముడుకి కమెడియన్‌గా గుర్తింపు ఉండేది. కానీ కలర్ ఫోటో సినిమాతో ఎమోషనల్‌ కారెక్టర్లో కూడా అందిరనీ మెప్పించాడు. సీన్లతో ఏడిపించేశాడు. అలా హర్ష నటనకు అంతా ఫిదా అయ్యారు. ఇప్పుడు హర్ష టాప్ మోస్ట్ కమెడియన్‌గా దూసుకుపోతోన్నాడు. 

హర్ష ప్రస్తుతం తన భార్యతో కలిసి కాశ్మీర్ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందులో తన భార్యతో ముద్దూ ముచ్చట్లు పెట్టేసుకుంటాడు. గత ఏడాది ఈ ఇద్దరికి పెళ్లి జరిగిందన్న సంగతి తెలిసిందే. హర్ష అక్షర జంట పెళ్లికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా వెళ్లాడు.

పెళ్లై ఏడాది అయిన సందర్భంగా హర్ష తన భార్యతో కలిసి శ్రీనగర్, జమ్మూ అంటూ ఇలా తిరిగేస్తున్నాడు. మామూలుగానే హర్ష రేసర్ అన్న సంగత తెలిసిందే. బైక్ మీద హిమాలయలకు వెళ్తుంటాడు. ఇప్పుడు తన భార్యతో కలిసి వెకేషన్లో సందడి చేస్తున్నాడు.

కార్తికేయ 2  సినిమాతో ప్రస్తుతం హర్ష నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయ్యాడు. హర్ష చేసిన కామెడీ, యాక్టింగ్‌కు నార్త్ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం హర్ష చేతిలో బోలెడన్ని ప్రాజుక్టులున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లోనూ హర్షకు చాన్స్‌లు వస్తున్నాయి.

తన భార్యతో కలిసి వెకేషన్లో ఎంజాయ్ చేస్తోన్న హర్ష.. పెళ్లై ఏడాది అయింది.. కానీ ఇదేదో నిన్నా మొన్నా జరిగినట్టుగా అనిపిస్తోంది.. ఇదే మా అధికారంగా మొదటి ట్రిప్. శ్రీనగర్ లేక్‌లో మొదటి రోజు అని చెప్పుకొచ్చాడు. ఇక రెండో రోజు మౌంటెన్స్ మ్యాగీ మేరీ జాన్ అంటూ ఇలా చెప్పుకొచ్చాడు. మొత్తానికి హర్ష మాత్రం వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నాడు.

Also Read : Kantara Movie IMDB rank : దటీజ్ కాంతారా.. దేశంలో నెంబర్ వన్

Also Read : Ginna - Ori Devuda : ఈ వారం బాక్సాఫీస్ వార్.. నిలిచేది ఎవరు?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News