Rana Grandmother Passes Away: సినీ ఇండస్ట్రీలో విశేషమైన గుర్తింపు సంపాదించిన దగ్గుబాటి కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు అత్తగారు రాజేశ్వరి దేవి అనారోగ్యంతో మృతి చెందారు.
దగ్గుబాటి సురేష్ బాబు భార్య లక్ష్మి తల్లి అయిన రాజేశ్వరి దేవి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
రాజేశ్వరి దేవి మరణంతో రానా కుటుంబసభ్యులందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అమ్మమ్మకు తుది వీడ్కోలు పలికే సమయంలో.. రానా భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంత్యక్రియల్లో రానా, అతని తల్లి లక్ష్మి, దగ్గుబాటి సురేష్ బాబు పాల్గొన్నారు. కాగా అమ్మమ్మ పాడెను రానా మోసారు. రాజేశ్వరి దేవి మరణం దగ్గుబాటి కుటుంబానికి తీరని లోటుగా మారింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం రానా సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ తన కెరియర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. అంతేకాకుండా పలు టాక్ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నాడు. ‘రానా దగ్గుబాటి షో’ అంటూ బాగా పాపులర్ అయిన షోలో ఈ మధ్యనే తన రాబోయే సినిమాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు ఈ హీరో. విరాటపర్వం చిత్రం తరువాత రానా హీరోగా ఎటువంటి సినిమా రాలేదు ‘స్పై’ మూవీలో క్యామియో పాత్రలో కనిపించగా.. ‘వేట్టయన్’లో విలన్ గా చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో తాను మూడు చిత్రాలలో హీరోగా కనిపించనున్నానుని తెలియజేశారు. ఇందులో ఒకటి గుణశేఖర్ దర్శకత్వంలో రానున్న.. హిరణ్య కశ్యప.. మరొకటి తేజా దర్శకత్వంలో చేయబోతున్న రాక్షస రాజా. ఇక మూడో సినిమా గురించి పెద్దగా క్లారిటీ లేకపోయినా.. రానా ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో కనిపించనున్నారు అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
Also Read: Gold Rate Today: భగ్గుమన్న బంగారం.. ఏకంగా తులంపై రూ. 4,360 పెరుగుదల.. తాజా ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read: Bank Jobs 2025: బ్యాంక్ ఆప్ మహారాష్ట్రలో ఉన్నత ఉద్యోగాలు, రాత పరీక్ష లేకుండానే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి