Rana Daggubati remuneration: పవన్ సినిమాలో రానా దగ్గుబాటి రెమ్యునరేషన్‌

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 30వ చిత్రంగా తెరకెక్కనున్న అయ్యప్పనుం కొషియం తెలుగు రీమేక్ సినిమా ఇవాళే లాంఛనంగా ప్రారంభమైంది. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కొషియం సినిమాలో బిజు మీనన్, పృధ్వీ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు.

Last Updated : Dec 21, 2020, 11:18 PM IST
  • పవన్ కల్యాణ్ సినిమాకు సైన్ చేసిన రానా దగ్గుబాటి.
  • పవన్ కల్యాణ్ సినిమాకు అంగీకరించినందుకు రానాకు భారీ పారితోషికం అందిస్తున్నట్టు టాక్.
  • మళయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాను తెలుగులో ఈ ఇద్దరు ప్రధాన పాత్రల్లో డైరెక్ట్ చేసేందుకు రెడీ అయిన సాగర్ చంద్ర.
Rana Daggubati remuneration: పవన్ సినిమాలో రానా దగ్గుబాటి రెమ్యునరేషన్‌

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 30వ చిత్రంగా తెరకెక్కనున్న అయ్యప్పనుం కొషియం తెలుగు రీమేక్ సినిమా ఇవాళే లాంఛనంగా ప్రారంభమైంది. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కొషియం సినిమాలో బిజు మీనన్, పృధ్వీ రాజ్ ప్రధాన పాత్రలు పోషించగా తెలుగులో వారి స్థానంలోనే పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. 

మళయాళం వెర్షన్‌లో బిజూ మీనన్ పోషించిన పాత్రలో పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) కనిపించనుండగా.. పృధ్వీరాజ్ నటించిన పాత్రను రానా దగ్గుబాటి పోషించనున్నాడు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి పాత్ర ముఖ్యమైనదే అయినప్పటికీ.. నిడివి మాత్రం ఎక్కువేం కాదని.. అయినప్పటికీ ఈ సినిమాకు సైన్ చేసినందుకుగాను భారీ పారితోషికమే ముట్టజెప్పినట్టు టాలీవుడ్ టాక్. 

Also read : Pawan Kalyan-Rana: లాంఛనంగా ప్రారంభమైన పవన్, రానా రీమేక్ చిత్రం

అయ్యప్పనుం కొషియం తెలుగు రీమేక్ సినిమాకు ( Ayyappanum koshiyum Telugu remake ) సైన్ చేసినందుకుగాను రానా దగ్గుబాటికి రూ. 6 కోట్లు రెమ్యునరేషన్ ( Rana Daggubati ) ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఎస్ రాధాకృష్ణ ( చినబాబు ) నిర్మిస్తున్న ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేయనున్నాడు. పొలిటికల్ టచ్ డ్రామాతో తెరకెక్కనున్న ఈ సినిమాపై అప్పుడే పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో హైప్ క్రియేట్ అయింది.

Also read : Pawan Kalyan-Rana: అదిరిపోయే కాంబినేషన్.. పవన్ మూవీలో రానా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News