మాజీ ప్రేమికులు ఇద్దరూ మళ్లీ కలిసి స్టెప్పేస్తే ఆ మజానే వేరు

ఆ ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేస్తోంటే.. ఆ దృశ్యం చూసి వారెవ్వా.. క్యా సీన్ హై అని అనుకున్నారు ఆ ఇద్దరి అభిమానులు.

Last Updated : Apr 6, 2018, 12:29 AM IST
మాజీ ప్రేమికులు ఇద్దరూ మళ్లీ కలిసి స్టెప్పేస్తే ఆ మజానే వేరు

రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకునె.. వాళ్లిద్దరూ ఒకప్పుడు లవ్ బర్డ్స్... పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. చాలా కాలం పాటు డేటింగ్ చేశారు. ఏవో తేడాలు రావడంతో ఆ తర్వాత ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ అయిపోయారు. వాళ్ల ప్రేమ పురాణం గడిచిపోయి కూడా ఏళ్లయిపోయింది. అదంతా ఇప్పుడు వాళ్ల జీవితాల్లో ఒక గతం మాత్రమే. వాళ్లిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నాకా.. యె జవానీ హై దివానీ, తమాషా అనే రెండు సినిమాల్లో కలిసి నటించారు. అందులో మొదటిది బాలీవుడ్ లోని బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటి అనిపించుకుంది. ముఖ్యంగా ఆ ఇద్దరి కెమిస్ట్రీ ఆ సినిమాకు ఓ స్పెషల్ హైలైట్. తమాషా సినిమా తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ ఎప్పుడూ కలిసి నటించలేదు. దీంతో ఇక ఈ ఇద్దరూ కలిసి కనిపించే ఛాన్స్ లేనట్టేనా అని దిగాలు పడ్డారు ఆ ఇద్దరిని ఒకే తెరపై చూడాలనుకున్న అభిమానులు. ఆ ఇద్దరి మధ్య దూరం అంతగా పెరిగిపోయింది. 

 

సీన్ కట్ చేస్తే ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ అనుకోకుండా మళ్లీ ఆ ఇద్దరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. అనుకోకుండా వచ్చిన ఆ సందర్భం వాళ్లని తమ గతం మర్చిపోయేలా చేసింది. మళ్లీ పురివిప్పిన నెమలిలా ఇద్దరూ కలిసి స్టెప్పేశారు. తమ తమ సినిమాల హిట్ సాంగ్స్‌కి ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేస్తోంటే.. ఆ దృశ్యం చూసి వారెవ్వా.. క్యా సీన్ హై అని అనుకున్నారు ఆ ఇద్దరి అభిమానులు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ వీడియోలపై మీరూ ఓ లుక్కేసేయండి. 

 

 

Trending News