Ram Charan New Movie: రామ్ చరణ్‌ సరసన స్టార్ హీరోయిన్ కూతురు.. ఎవరంటే?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలో చరణ్ కు జోడిగా ఓ స్టార్ హీరోయిన్ కుమార్తె నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2023, 01:01 PM IST
Ram Charan New Movie: రామ్ చరణ్‌ సరసన స్టార్ హీరోయిన్ కూతురు.. ఎవరంటే?

Ram Charan Upcoming Movie:  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి కియారా అద్వాణీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో చరణ్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు సగం పూర్తయింది. అంతేకాకుండా ఈ సినిమాకు లీకుల బెడద కూడా ఎక్కువగానే ఉంది. ఇటీవల ఓ సాంగ్ లీకైన సంగతి తెలిసిందే. 

మరోవైపు రామ్ చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీని ఎంపిక చేసినట్లు ఫిలిం వర్గాల టాక్. ఇదే నిజమైతే రవీనా టాండన్ కూతురు రాషా ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందన్న మాట. రీసెంట్ గా రవీనా టాండన్‍తో రాషా హైదరాబాద్ రావడం ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయింది. అయితే లుక్ టెస్ట్ కోసమే రాషా హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. 

ఇప్పటికే దేవరతో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా మరో హీరోయిన్ తెలుగులోకి రావడం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. రాషా తడానీకి ప్రస్తుతం 18 ఏళ్లు. హిందీలో ఇది వరకే ఒక ప్రాజెక్ట్ కు ఓకే చెప్పింది. ఇప్పుడు తెలుగులో ఈ మూవీ కన్ఫర్మ్ అయితే అది రెండో ప్రాజెక్ట్ అవుతుంది. బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.  

Also Read: Kushi on OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'ఖుషి' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News