Prabhas Kalki Ott Rights: కళ్లు చెదిరే భారీ రేటుకు అమ్ముడుపోయిన 'కల్కి' ఓటీటీ రైట్స్.. నెవర్ బిఫోర్..

Prabhas Kalki Ott Rights: ఈ మధ్యకాలంలో బడా హీరోల చిత్రాలకు సెట్స్ పై ఉండగానే డిజిటిల్, శాటిలైట్స్ రూపేణా భారీ మొత్తంలో నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ అందుకుంటున్నారు. ఈ కోవలో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రభాస్ 'కల్కి' మూవీ ఓటీటీ రైట్స్ డీల్ క్లోజ్ అయింది. అది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని కళ్లు చెదిరే భారీ రేటుకు ?

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 24, 2024, 09:25 AM IST
Prabhas Kalki Ott Rights: కళ్లు చెదిరే భారీ రేటుకు అమ్ముడుపోయిన 'కల్కి' ఓటీటీ రైట్స్.. నెవర్ బిఫోర్..

Prabhas Kalki Ott Rights: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ కోవలో ముందుగా 'కల్కి 2898 AD' మూవీ రిలీజ్ కానుంది. ముందుగా ఈ చిత్రాన్ని పొంగల్ పోటీలో రిలీజ్ చేద్దామనుకున్నారు. అప్పటికే సలార్ సినిమా లేట్ కావడం.. దాంతో ఈ సినిమా షూటింగ్ విషయమై డిలే జరిగింది. దీంతో ఈ సినిమాను మే 9న పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జనరల్ ఎలక్షన్స్  హడావుడి ఉంది. ప్రజలందరి మూడ్ ఎన్నికలపైనే ఉంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా మే 13న పోలింగ్ డేట్ ఉంది. తెలంగాణలో లోక్‌సభ  ఎన్నికలు.. ఏపీలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను మే 9న విడుదల చేయడం డౌటే అని చెబుతున్నారు. పైగా ఈ సినిమా ప్యాన్ ఇండియా మూవీ.. అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ జూన్ 4 రిజల్డ్ డేట్ వరకు ఉంటుంది. మరోవైపు కల్కి సినిమాకు ఎక్కువ డబ్బులు రావాలంటే ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడాల్సిందే. ప్రస్తుతం పోలీస్ ఇతర ప్రభుత్వ యంత్రాగం మొత్తం ఎలక్షన్స్ పైనే దృష్టి కేంద్రీకరిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు స్పెషల్ షో పర్మిషన్స్.. రావడం కష్టమనే అభిమాప్రాయాలున్నాయి. అందుకే ఈ సినిమాను ఎన్నికల తర్వాత మంచి డేట్‌లో ఏ సినిమా పోటీ లేకుండా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. తాజాగా ఈ సినిమాను ఆగష్టు లేదా సెప్టెంబర్‌లో సోలో రిలీజ్ డేట్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

మరోవైపు ఈ సినిమా విడుదలకు ముందే ప్రముఖ ఓటీటీ భారీ రేటు పెట్టి ఈ సినిమా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం. అది కూడా అన్ని భాషలకు కలిపి దాదాపు రూ. 200 కోట్లు పెట్టి ఈ సినిమా ఓటీటీ రైట్స్ తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా శాటిలైట్ దాదాపు రూ. 100 కోట్ల వరకు అమ్ముడు పోయినట్టు సమచారం. మరోవైపు ఆడియో రైట్స్ అన్ని భాషల రూపేణా దాదాపు రూ. 100 కోట్ల మేరకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ రకంగా కల్కి మూవీకి రిలీజ్‌కు ముందే నిర్మాతకు భారీ లాభాలనే తీసుకొచ్చిందనే చెప్పాలి. థియేట్రికల్‌గా ఈ సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుందో చూడాలి.

కల్కి సినిమా షూటింగ్ విషయానికొస్తే.. ఆ మధ్య  ప్రభాస్, దిశా పటానీలపై ఇటలీలోని 'సార్డినియా' ద్వీపంలో గడ్డకట్టే చలిలో ఓ పాటను పిక్చరైజ్ చేసారు. అక్కడ ప్రభాస్, దిశా పటానీలు అక్కడ దిగిన ఫోటోను చిత్ర యూనిట్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. అక్కడ షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ భారత్‌కు తిరిగి వచ్చింది. ఆ తర్వాత కొన్ని కీలక సన్నివేశాలతో 'కల్కి' షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అటు కమల్ హాసన్ విలన్ పాతర్లో కనిపించనున్నారు. దీపికా, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తోంది. ఇప్పటికే దీపికాకు సంబంధించిన షూట్ కంప్లీటైంది.

ఇక 'కల్కి' మూవీ మహాభారతంతో మొదలై 2898 ADతో ముగుస్తుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. మొత్తంగా 6 వేల యేళ్ల ప్రయాణాన్ని 'కల్కి' మూవీలో  స్క్రీన్ పై చూపించనున్నారు. అంతేకాదు ఇందులో  నాటి రోజులకు తగ్గట్టు భారతీయత ఉట్టిపడేలా ఓ కొత్త ప్రపంచాన్నే ఈ సినిమా యూనిట్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తర్వాత ముందుగా మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' మూవీని కంప్లీట్ చేయనున్నాడు. ఆ తర్వాత  సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ ఉండనే ఉంది. అటు ఫైటర్ మూవీ దర్శకుడు సిద్ఘార్ధ్ ఆనంద్ మూవీ ఉండనే ఉంది. అటు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ మూవీ చేయబోతున్నట్టు సమాచారం. అటు కన్నప్ప సినిమాలో ప్రభాస్.. మహా శివుడి పాత్రలో  కనిపించబోతున్న సంగతి తెలిసిందే కదా.  మరోవైపు ప్రభాస్ ఎక్స్(ట్విట్టర్) టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ భారత్‌ లిస్టులో ఏకైక హీరోగా నిలిచారు ప్రభాస్. ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో టాప్ 10 మోస్ట్ యూజ్‌డ్ హ్యాష్ ట్యాగ్స్ లో ప్రభాస్ మాత్రమే చోటు దక్కించుకున్నారు. ట్విట్టర్ భారత్ (ఇండియా) ఈ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇది ప్రభాస్ స్టార్ డమ్ కు నిదర్శనం.

ఇదీ చదవండి: మసాలా ఎక్కువగా ఉండే ఆహారం తింటున్నారా? అయితే, ఈ వ్యాధులు మీకోసం ఎదురుచూస్తున్నాయి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News