Rhea Chakraborty's bail plea: రియాకు మరోసారి షాక్

బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) ఆరోపణలు ఎదుర్కొంటూ.. అతనికి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన అతని ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty) కి కోర్టులో మరోసారి చుక్కెదురైంది. సుశాంత్ మరణం కేసులో డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రియా చక్రవర్తిని మూడు రోజులపాటు వరుసగా ప్రశ్నించిన అనంతరం ఈ నెల 9న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Last Updated : Sep 11, 2020, 03:02 PM IST
Rhea Chakraborty's bail plea: రియాకు మరోసారి షాక్

Rhea Chakraborty bail plea rejects Bombay HC: బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) ఆరోపణలు ఎదుర్కొంటూ.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన అతని ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty) కి కోర్టులో మరోసారి చుక్కెదురైంది. సుశాంత్ మరణం కేసులో డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రియా చక్రవర్తిని మూడు రోజులపాటు వరుసగా ప్రశ్నించిన అనంతరం ఈ నెల 9న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె స్థానిక కోర్టులో పిటిషన్ వేయగా.. న్యాయస్థానం దానిని తిరస్కరిస్తూ 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో రియాతోపాటు అరెస్టయిన ఆమె సోదరుడు, మరో నలుగురు వ్యక్తులు ముంబై ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. Also read: Parliament: చరిత్రలో నిలిచిపోనున్న పార్లమెంట్ సమావేశాలు

శుక్రవారం బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన ముంబై ప్రత్యేక కోర్టు.. బెయిల్ పిటిషన్లంటిని తిరస్కరించింది. దీంతో రియా చక్రవర్తితోపాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ మేనేజనర్ శామ్యూల్ మిరాండా, పని మనిఫి దీపేశ్ సావంత్, డ్రగ్స్ డీలర్లు అబ్దుల్ బాసిత్, జైద్ విలాత్రా మిగతా వారంతా ఈ నెల 22వరకు జ్యుడిషియల్ కస్టడీపై జైలులో ఉండాల్సి ఉంటుంది.  Also read: Parliament session: ప్ర‌శ్నోత్త‌రాలు లేకుండానే పార్ల‌మెంట్‌

Trending News