RRR beats Hollywood Movie Record: ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం అమెరికాలో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. తొలి రోజు అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా నమోదైంది. హాలీవుడ్ చిత్రాలను సైతం మించి 'ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ సాధించిందంటే.. తెలుగు సినిమా స్టామినా ఏ రేంజ్‌కు చేరిందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో పలు చోట్ల ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధించింది.
హాలీవుడ్ చిత్రం బ్యాట్ మ్యాన్‌ను మించి ఆర్ఆర్ఆర్ వసూళ్లు సాధించింది. తొలిరోజు బ్యాట్ మ్యాన్ 1.4 మిలియన్ డాలర్లు వసూళ్లు సాధిస్తే.. ఆర్ఆర్ఆర్ 3.1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే, సరాసరిగా ఒక్కో లొకేషన్లో ఆర్ఆర్ఆర్ 3100 డాలర్లు వసూళ్లు సాధిస్తే.. బ్యాట్ మ్యాన్ 467 డాలర్లు మాత్రమే సాధించింది. అమెరికాలో బాహుబలిని మించిన కలెక్షన్లు ఆర్ఆర్ఆర్ సాధిస్తుందని ఈ ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది.
ఆర్ఆర్ఆర్ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. విడుదలైన అన్నిచోట్ల ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రాజమౌళి మార్క్ కథా, కథనం, టేకింగ్.. తారక్, చెర్రీల నటన.. ఆద్యంతం కట్టిపడేసే విజువల్స్.. అన్నీ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాను పీక్స్‌లో నిలబెట్టాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ దెబ్బతో జక్కన్న పేరు ప్రపంచవ్యాప్తంగా మరోసారి మారుమోగడం ఖాయమంటున్నారు. ఈ సినిమా కోసం జక్కన్న అండ్ టీమ్ దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడిన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి ఆర్ఆర్ఆర్ టీమ్ ఫుల్ ఖుషీ అవుతోంది. ఆర్ఆర్ఆర్ సక్సెస్‌పై ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తమ పట్ల ఇంత ప్రేమ, ఆదరాభిమానాలు చూపిస్తున్నందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
Also read: Flipkart mobile fest: ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ సేల్.. అన్ని ఫోన్లపై భారీ తగ్గింపు!
Also read: Realme C31: రియల్మీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్- తక్కువ ధరలోనే అదిరే ఫీచర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook