S Thaman TRolling  : విజయ్‌కి ఫ్యాన్‌.. ఎంత మందికి అదే మాట చెబుతావ్.. తమన్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు

Varisu Audio Function దళపతి విజయ్ వారిసు సినిమా ఆడియో ఈవెంట్‌ నిన్న చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్‌లో చిత్రయూనిట్ విజయ్‌ భజన చేసింది. అందులో తమన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 02:33 PM IST
  • వారిసు ఆడియో ఫంక్షన్
  • విజయ్ భజన చేసిన టీం
  • తమన్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు
S Thaman TRolling  : విజయ్‌కి ఫ్యాన్‌.. ఎంత మందికి అదే మాట చెబుతావ్.. తమన్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు

Thalapathy Vijay Fan సినిమా ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో హీరోల మీద చేసే భజనలు, కీర్తనలు ఒక్కోసారి హద్దులు దాటుతుంటాయి. తెలుగులోనే ఈ పైత్యం ఉందని అనుకుంటే పొరబాటే. అన్ని చోట్లా ఇలానే ఉంటోంది. హీరోలను పొగుడుతూ కలియుగ దైవాలు కీర్తిస్తుంటారు సినిమా యూనిట్ సభ్యులు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ వంటి వారు స్టేజ్ మీద ఉంటే..ఒక్కొక్కరు రెచ్చిపోతోంటారు. తమ తమ ప్రేమను కురిపిస్తుంటారు. కొన్ని సార్లు అది అతిగా అనిపిస్తుంటుంది. అందుకే కొంత మంది స్టార్ హీరోలు ఈవెంట్లకు వచ్చేందుకు ముందూ వెనకా ఆలోచిస్తుంటారు.

ఇక తమన్‌ ఈ మధ్య స్టార్ హీరోలందరితోనూ పని చేస్తున్నారు. చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్ ఇలా అందరితోనూ పని చేశాడు. అయితే ఈ సినిమా సమయంలో తమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చకు దారి తీస్తున్నాయి. చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని తమన్ చెప్పాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి సైతం ఫ్యాన్ అని అన్నాడు. బాలయ్యకు వీరాభిమాని అని చెప్పాడు. ఇక తమిళంలో అయితే తలా అజిత్‌కి సైతం ఫ్యాన్ అని చెప్పాడు.

 

ఇప్పుడు వారిసు ఆడియో ఫంక్షన్‌లో తాను విజయ్‌కి లైఫ్ టైం అభిమానిని అని చెప్పేశాడు. ఒక్క తమన్ మాత్రమే కాదు.. దిల్ రాజు సైతం అదే బాట పట్టాడు. విజయ్‌ మాత్రమే సూపర్ స్టార్, అతనే నెంబర్ వన్ అన్నట్టుగా చెప్పేశాడు. రష్మిక సైతం తాను విజయ్ అభిమానిని అని చెప్పుకొచ్చింది. ఈ అందరి సంగతి ఇలా ఉంటే.. తమన్‌ ప్రతీ హీరో మీద వేసిన ట్వీట్లను తవ్వి తీస్తున్నారు నెటిజన్లు.

అందరికీ ఫ్యాన్‌వా నువ్వు.. ఎందుకు ఇలా ఓవర్‌గా మాట్లాడతావ్‌.. అంటూ తమన్‌ను ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి వారిసు మాత్రం పక్కా తమిళ సినిమాయే అని మరోసారి దిల్ రాజు స్టేజ్ మీద చెప్పేశాడు. మరి ఈ సినిమాను తెలుగులో ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తాడో చూడాలి.

Also Read : Mahesh Babu's : మహేష్ బాబు జాతకం వల్లనే వరుస మరణాలు.. అసలు విషయం చెప్పిన వేణుస్వామి!

Also Read : Balakrishna: బాలయ్య బాబు కొడతాడు,కోప్పడతాడు, కసురుకుంటాడని ఎవర్రా బాబు చెప్పింది ?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News