Salaar 2: రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సెసరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన తన కంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. ఇక ప్రభాస్ తన కెరీర్‌లో 'బిల్లా' సినిమాలో తొలిసారి హీరోగా.. విలన్‌గా డ్యూయల్ రోల్లో మెప్పించాడు. ఆ తర్వాత బాహుబలి సిరీస్‌లో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి (శివుడు)గా తండ్రీ కుమారులుగా రెండు విభిన్న పాత్రల్లో మెప్పించాడు. తాజాగా ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తోన్న సలార్ మూవీ పార్ట్ 2లో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సన్నివేశాల్లో తండ్రి పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఈ పాత్రను ప్రభాస్ చేయనున్నట్టు సమాచారం. అంటే తండ్రి పాత్రలో కూడా ప్రభాస్ కనిపించనున్నాడట. ఇక తల్లి పాత్రలో మరో కథానాయికగా నటిస్తోంది. ప్రభాస్‌ను పెంపుడు తల్లిగా ఈశ్వరీ బాయ్‌గా కనిపించనున్నట్టు సమాచారం. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రభాస్.. విషయానికొస్తే.. సలార్ పార్ట్ 2 వచ్చే యేడాది ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది. సలార్ పార్ట్ 2 షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ప్యాచ్ వర్క్ ఇతర షూటింగ్ గట్రా .. జూలై చివరి నాటికి పూర్తి కానుంది. అప్పటి నుంచి గ్రాఫిక్ వర్క్ ప్రారంభం కానుంది. ఏదైనా సీన్స్ రీ షూట్ చేయాల్సి ఉంటే దానికో వారం పదిరోజులు పాటు ప్రభాస్ డేట్స్ కేటాయించనున్నాడు.
ఇక ప్రభాస్ ప్రస్తుతం .. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 AD' మూవీ చేసాడు. ఈ సినిమా జూన్ 27వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో 6 వేల ప్రయాణాన్ని చూపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ బుజ్జి(కారు)కి మంచి పేరే వచ్చింది. మొత్తంగా ట్రైలర్ విడుదల ఈ సినిమాపై అంచనాలు మరిన్ని పెరగడం ఖాయం. ఈ సినిమాలో దీపికా పదుకొణే, దిషా పటానీ కథానాయికలుగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేసారు.
Also read: AP Elections Survey: ఏపీలో అధికారం ఎవరిది, జగన్‌కు క్లారిటీ వచ్చేసిందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook