టైగర్ జిందా హై.. కలెక్షన్స్ కతర్నాక్ హై!!

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా తెరకెక్కిన టైగర్ జిందా హై సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.

Last Updated : Jan 10, 2018, 03:24 PM IST
 టైగర్ జిందా హై.. కలెక్షన్స్ కతర్నాక్ హై!!

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా తెరకెక్కిన టైగర్ జిందా హై సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. భారత్‌లో ఇప్పటికే రూ.300 కోట్ల మైలురాయి దాటిన ఈ సినిమా ఓవర్సీస్‌లోనూ భారీగానే వసూళ్లు రాబడుతోంది. బాలీవుడ్ లైఫ్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. ఇంటా, బయటా బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.555 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. అలీ అబ్బాస్ జఫర్ డైరెక్ట్ చేసిన టైగర్ జిందా హై సినిమా 2012లో రిలీజైన ఏక్ థా టైగర్ సినిమాకు సీక్వెల్.

భజ్రంగీ భాయిజాన్, సుల్తాన్ సినిమాల తర్వాత సల్మాన్‌ని మరోసారి రూ.500 కోట్ల క్లబ్‌లో చేర్చిన సినిమా ఇది. టైగర్ జిందా సినిమాకన్నా ముందు విడుదలైన 'ట్యూబ్ లైట్' సల్మాన్‌ని, అతడి అభిమానులని తీవ్రంగా నిరాశపర్చినా.. 'టైగర్ జిందా హై' మాత్రం సల్లూ భాయ్ ఈజ్ బ్యాక్ అనిపించేలా చేసింది.

Trending News