Samantha as Pakistan terrorist: పాకిస్థాన్ టెర్రరిస్టుగా సమంత

సమంత అక్కినేని తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విభిన్నమైన జానర్లలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తోన్న సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ( The family man 2 web series ) అనే వెబ్ సిరీస్ కోసం మొదటిసారిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతోంది. అలాగే ఈ వెబ్ సిరీస్‌తో సమంత తొలిసారిగా OTT ప్లాట్ ఫామ్‌లోకి కూడా అడుగుపెడుతోంది.

Last Updated : Oct 3, 2020, 02:01 AM IST
Samantha as Pakistan terrorist: పాకిస్థాన్ టెర్రరిస్టుగా సమంత

సమంత అక్కినేని ( Actress Samantha Akkineni ) తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విభిన్నమైన జానర్లలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తోన్న సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ( The family man 2 web series ) అనే వెబ్ సిరీస్ కోసం మొదటిసారిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతోంది. అలాగే ఈ వెబ్ సిరీస్‌తో సమంత తొలిసారిగా OTT ప్లాట్ ఫామ్‌లోకి కూడా అడుగుపెడుతోంది. Also read : Niharika fitness secrets: నిహారిక పెళ్లికి రెడీ అవుతోందట!

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ నుండి సమంత ప్రీ-లుక్ పోస్టర్ ( Samantha pre-look poster ) విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌లో పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాదిగా సమంత అక్కినేని కనిపించబోతోంది అని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పార్ట్ లాక్ డౌన్‌కి ముందే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్‌ని రాజ్ నిడిమోరు, కృష్ణ డికె ( Raj Nidimoru, Krishna DK ) డైరెక్ట్ చేస్తున్నారు. మనోజ్ బాజ్‌పేయి, ప్రియామణి నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్‌లో ఒక మధ్యతరగతి వ్యక్తిగా కనిపించే ఒక సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌ నేపథ్యంతో తెరకెక్కుతోంది. Also read : Allu Arjun about Palasa 1978: దర్శకుడికి అల్లు అర్జున్ బూస్టింగ్

డిసెంబర్ 2న ఈ వెబ్ సిరీస్ విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. పార్ట్ 1 హిట్ అయినందున ఈ పార్ట్ 2 వెబ్ సిరీస్‌పై ఆడియెన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

Trending News