Evaru Meelo Koteeswarlu: సమంత ప్రొమో వచ్చేసింది..తారక్ పై సామ్ సీరియస్

Evaru Meelo Koteeswarlu: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బుల్లితెర‌పై తెగ సంద‌డి చేస్తున్నాడు. ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్యక్ర‌మంతో మంచి వినోదం పంచుతున్నాడు. తాజాగా ఈ షోలో స్టార్ హీరోయిన్ సమంత మెరవబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2021, 05:34 PM IST
Evaru Meelo Koteeswarlu: సమంత ప్రొమో వచ్చేసింది..తారక్ పై సామ్ సీరియస్

Evaru Meelo Koteeswarlu: యంగ్ టైగర్ ఎన్టీఆర్(jr ntr) వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రిస్తోన్న షో ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’. సామాన్యుల‌తో పాటు, అప్పుడప్పుడు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ షోలో సంద‌డి చేస్తున్నార‌నే విష‌యం తెలిసిందే. హీరోయిన్ స‌మంత ఈ నవరాత్రి సందర్భంగా ఈ షో(Evaru Meelo Koteeswarlu)లో మెరవబోతున్నారు. పండుగ స్పెషల్ నేపథ్యంలో ఈ నెల 14న జెమినీ టీవీలో స‌మంత(Samantha) స్పెష‌ల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా షో ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.

ప్రోమో(Promo) విషయానికి వస్తే..  ఇక్కడ కూర్చుంటే భయంగా ఉంది అని సమంత అనగా.. అది హాట్ సీట్ అలాగే ఉంటుందని తారక్ బదులిచ్చాడు. నాకు డబ్బు వద్దులే అని ఒకసారి.. కావాలి అని మరోసారి సమంత అనడం మీరు చూడవచ్చు.  క్విట్ అయిపోతారా అని ఎన్టీఆర్ అడగ్గా… మీరు ఇప్పుడు చెబుతున్నారు, ముందే చెప్పాలి కదా అంటూ సమంత చిరు కోపం ప్రదర్శించడంతో ప్రోమో ఎండ్ అవుతోంది.

Also read: MAA Elections 2021: ముగిసిన మా ఎన్నికలు, ఓటు వేయని స్టార్ హీరోలు

ఈ కార్యక్రమం సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న  సంగతి తెలిసిందే. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కూడా త్వ‌ర‌లోనే ఈ షోలో క‌నిపించ‌బోతుంద‌ని టాక్. ద‌స‌రా నేపథ్యంలో మ‌హేశ్ బాబు(Superstar Maheshbabu), ఎన్టీఆర్ స్పెష‌ల్ ఎపిసోడ్ ప్ర‌సారంకానుంద‌ని ఇప్ప‌టికే వార్త‌లు వస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ షోలో ఇప్ప‌టికే టాలీవుడ్ సెల‌బ్రిటీలు రాంచ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News