Oo Antava vs Kissik: ఊ అంటావా V's కిస్సిక్.. ట్రోల్స్ పై సమంత కామెంట్ ఇదే..!

Samantha vs Sreeleela: అల్లు అర్జున్,  సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప . 2021 లో డిసెంబర్ 17వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్.. ప్రేక్షకులను ఉర్రూతలూగించింది అని చెప్పవచ్చు.  ఇందులో మొదటిసారి సమంత ఐటెం సాంగ్ చేసింది. దీనికి తోడు తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ మెప్పించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. 

Written by - Vishnupriya | Last Updated : Nov 26, 2024, 03:51 PM IST
Oo Antava vs Kissik: ఊ అంటావా V's కిస్సిక్.. ట్రోల్స్ పై సమంత కామెంట్ ఇదే..!

Samantha Review Kissik: ఇదిలా ఉండగా మరొకవైపు పుష్ప -2  సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కాబోతోంది.. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్.. కిస్ కిస్ కిస్సా కిస్సిక్.. లిరికల్ వీడియోని తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలో శ్రీ లీల తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. కానీ మిశ్రమ స్పందన లభిస్తుంది. 

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా ఈ పాట చూసిన తర్వాత చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పాట కంటే సమంత ఊ అంటావా చాలా బాగుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం  పనిచేసినందుకు సమంతకు రూ .5 కోట్లు పారితోషకం ఇచ్చారు. కానీ పుష్ప -2 లో నటించిన శ్రీలీల కు  కేవలం రూ .2కోట్లు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం.

ఇకపోతే ఇలా రెండు పాటలను కంపేర్ చేస్తూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్న విషయంలో తాజాగా సమంత ఒక పోస్ట్ పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా సమంత తన పోస్టులో శ్రీ లీల, అల్లు అర్జున్ కాంబినేషన్ ని తెరపై చూడడానికి చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాను అంటూ కామెంట్లు చేసింది.  డాన్సింగ్ క్వీన్ గా గుర్తింప తెచ్చుకున్న శ్రీ లీల సమంత కంటే బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుందన్న విషయం అందరికీ తెలిసింది. కానీ ఇక్కడ ఆడియన్స్ మాత్రం ఈ విషయాన్ని అంగీకరించడం లేదు. 

దీంతో రంగంలోకి దిగిన సమంత... శ్రీ లీల, అల్లు అర్జున్ ఫోటోని షేర్ చేస్తూ.. శ్రీ లీల ఈ పాటలో చంపేసింది. దయచేసి సైలెంట్ గా ఉండి పుష్ప -2 కోసం ఎదురు చూడండి అంటూ ఒక పోస్ట్ షేర్ చేసింది సమంత.  మొత్తానికైతే సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇకపోతే దేవిశ్రీప్రసాద్ ఈ పాటకి సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే.

Read more: Ram gopal Varma: ఆర్జీవీ ఇంటి దగ్గర హైటెన్షన్.. రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News