Samantha Deleted Story: సోషల్ మీడియా పోస్ట్ డిలీట్ చేసిన సమంత.. పాపం షాకిచ్చారుగా!

Samantha Ruthprabhu Shares Quotation of Marcus Aurelius: తాజాగా సమంత మార్కస్ ఆరేళ్యిస్ అనే రోమన్ చక్రవర్తి చెప్పినట్లుగా ఉన్న కొటేషన్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది, కాసేపటికే దాన్ని డిలీట్ కూడా చేసింది.   

Written by - Chaganti Bhargav | Last Updated : May 2, 2023, 09:24 PM IST
Samantha Deleted Story: సోషల్ మీడియా పోస్ట్ డిలీట్ చేసిన సమంత.. పాపం షాకిచ్చారుగా!

Samantha Ruthprabhu Deleted Instagram Story: విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి అటు సమంత కానీ ఇటు నాగచైతన్య గాని సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా అది చర్చనీయాంశంగా మారుతూనే వస్తుంది. మరీ ముఖ్యంగా నాగచైతన్య తన ప్రమోషన్స్ లేదా ఒకటి రెండు ఫోటోలు తప్ప పెద్దగా సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలను షేర్ చేసుకోడు.

కానీ సమంత మాత్రం తన సినిమా ప్రమోషన్స్ మొదలు హాట్ ఫోటోలు షేర్ చేయడం అదే విధంగా కొన్ని అనుమానాలు తావిచ్చే విధంగా ఉన్న కొటేషన్లు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె షేర్ చేసిన వెంటనే అవి మళ్ళీ వార్తల్లోకి ఎక్కి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటాయి. తాజాగా సమంత ఒక కొటేషన్ షేర్ చేయగా ఆ కొటేషన్ కరెక్ట్ కాదని ఫ్యాక్ట్ చెకర్లు తేల్చారు. అసలు విషయం ఏమిటంటే మార్కస్ ఆరేళ్యిస్ అనే రోమన్ చక్రవర్తి చెప్పినట్లుగా ఉన్న కొటేషన్ ని సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read: Chaithra Rai in NTR 30: కొరటాల మాస్టర్ స్కెచ్.. బాలీవుడ్ విలన్ కి భార్యగా తెలుగు టీవీ హీరోయిన్!

కానీ ఫ్యాక్ట్ చెకర్లు ఆ కొటేషన్ నిజమై ఉండవచ్చు కానీ సదరు రోమన్ చక్రవర్తి మాత్రం ఆ కొటేషన్ రాసినట్టు ఎక్కడా దాఖలాలు లేవని వెంటనే ఫ్యాక్ట్ చెక్ చేస్తూ ఇది ఫేక్ అనే విధంగా ఆమెకు సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఆమె షేర్ చేసిన కొటేషన్ లో ఏముందంటే మనం వినే ప్రతిదీ నిజం కాదు అది ఒక అభిప్రాయం మాత్రమే, అలాగే మనం చూసే ప్రతి విషయం నిజం కాదు కేవలం అది దృష్టి కోణం మాత్రమే అంటూ ఆమె రాసుకొచ్చింది.

అయితే అది ఎవరు రాశారు? అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ ఆమె షేర్ చేసిన విషయం మాత్రం ఆలోచించే విధంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఫ్యాక్ట్ చెకర్లు షాకిచ్చిన క్రమంలో సమంత ఆ పోస్టు డిలీట్ చేసింది. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక ఈ మధ్యనే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అందుకున్న సమంత ఈసారి చేస్తున్న సినిమాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్న కథలు మాత్రమే ఆమె ఎంచుకోవాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. 

Also Read: Cinema Theatres: ఏఏ రాష్ట్రంలో ఎన్ని సినిమా థియేటర్స్ ఉన్నాయో తెలుసా? స్టేట్ వైడ్ కౌంట్ ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 
 

Trending News