Powlen Jessica Suicide: లవ్ ఫెయిల్.. సూసైడ్ చేసుకుని తమిళ హీరోయిన్ మృతి!

 Actress Deepa Alias Powlen Jessica committed Suicide:  పౌలిన్ జెస్సికా అని పిలువబడే తమిళ నటి దీప 29 సంవత్సరాల వయస్సులో ఆత్మహత్య చేసుకుంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 18, 2022, 05:18 PM IST
Powlen Jessica Suicide: లవ్ ఫెయిల్.. సూసైడ్ చేసుకుని తమిళ హీరోయిన్ మృతి!

 Actress Deepa Alias Powlen Jessica committed Suicide At Her House In Chennai Virugambakkam: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పౌలిన్ జెస్సికా అని పిలువబడే తమిళ నటి దీప 29 సంవత్సరాల వయస్సులో ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని విరుగంబాక్కంలో ఆదివారం మధ్యాహ్నం ఆమె అపార్ట్‌మెంట్‌లోని ఒక గదిలో ఆమె ఉరి వేసుకుని కనిపించిందని నివేదికలు చెబుతున్నాయి. ఆమె వ్యక్తిగత జీవితం కారణంగానే ఈ విపరీతమైన నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆమె తన లవ్ లైఫ్ లో ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. గత కొన్నాళ్లుగా ఒంటరిగా జీవిస్తున్న దీప ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు స్నేహితులు చెబుతున్నారు. దీప కుటుంబ సభ్యులు ఆమెను సంప్రదించడానికి ఫోన్ చేయగా, వారి ఫోన్ ఆమె ఎత్తలేదు. దీంతో దీప స్నేహితుడు ఫ్లాట్‌కు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

దీప ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాధమికంగా భావిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైనట్లు తెలుస్తోంది. ఇందులో జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటానని, అయితే తన మరణానికి కారణం లేదని ఆమె రాసింది కానీ అతని పేరు ప్రస్తావించలేదని తెలుస్తోంది. దీప పలు తమిళ చిత్రాల్లో సహాయ నటిగా అలరించింది. చిన్న చిన్న పాత్రలు చేసినా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాక జనవరి 2022లో విడుదలైన వైతా చిత్రంతో మంచి పేరు సంపాదించింది.

దీపా ప్రస్తుతం విశాల్ నటించిన తుపరివాలన్‌లో ఒక పాత్రలో నటిస్తోంది. అతను నాసిర్ నటించిన వైదా చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో దీపకు 100Kకి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమెను దీపా అని పిలుస్తున్నా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్ పౌలెన్ జెస్సికా పేరుతో ఉంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తిగల తన వీడియోలు,  ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. ఇటీవల, ప్రముఖ గేయ రచయిత కబిలన్ కుమార్తె తూరిగై తన 28వ ఏట ఆత్మహత్య చేసుకుని మరణించింది. సెప్టెంబర్ 10న తూరిగై తన నివాసంలో ఉరి వేసుకుని మరణించింది. తూరిగై తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని బలవంతం చేశారనీ, ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని తేలింది. 

Also Read: Kriti Sanon and Prabhas dating: పెదనాన్న చనిపోయిన బాధలో ప్రభాస్.. కృతితో ప్రేమాయణమంటున్న బాలీవుడ్ మీడియా!

Also Read: Nani New Movie: మరో కొత్త దర్శకుడికి నాని గ్రీన్ సిగ్నల్.. అలాంటి ఎగ్జయిట్మెంట్ తోనే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News