Penny Song Promo: సర్కారు వారి పాట సెకండ్‌ సింగిల్‌ ప్రోమో ఔట్.. సూపర్ స్టార్ అభిమానులకు 'సూపర్ సర్ప్రైజ్'!!

Sitara entry in Sarkaru Vaari Paata Penny Promo. రెండో సింగిల్‌లో సూపర్ స్టార్ అభిమానులకు 'సూపర్ సర్ప్రైజ్' ఇచ్చింది 'సర్కారు వారి పాట' చిత్ర బృందం. పెన్నీ ప్రోమోలో మహేశ్‌ బాబు గారాలపట్టి సితార తళుక్కుమన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2022, 02:19 PM IST
  • సర్కారు వారి పాట సెకండ్‌ సింగిల్‌ ప్రోమో ఔట్
  • సూపర్ స్టార్ అభిమానులకు 'సూపర్ సర్ప్రైజ్'
  • 'సర్కారువారి పాట'లో సితార
Penny Song Promo: సర్కారు వారి పాట సెకండ్‌ సింగిల్‌ ప్రోమో ఔట్.. సూపర్ స్టార్ అభిమానులకు 'సూపర్ సర్ప్రైజ్'!!

Mahesh Babu daughter Sitara entry in Sarkaru Vaari Paata Second single Penny Promo: టాలీవుడ్ 'సూపర్‌ స్టార్‌' మహేశ్‌ బాబు, స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఫ్యామిలీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ప్రొడక్షన్స్,14 రీల్స్ ఎంటటైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వేసవి కానుకగా సర్కారు వారి పాట మే 12న విడుదల అవనుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి గత నెలలో మొదటి సింగిల్ రాగా.. ఈరోజు రెండో సింగిల్ వచ్చింది. 

రెండో సింగిల్‌లో సూపర్ స్టార్ అభిమానులకు 'సూపర్ సర్ప్రైజ్' ఇచ్చింది 'సర్కారు వారి పాట' చిత్ర బృందం. పెన్నీ ప్రోమోలో మహేశ్‌ బాబు గారాలపట్టి సితార తళుక్కుమన్నారు. ప్రతీ రూపాయిని అందరూ గౌరవించాలంటూ సాగే 'పెన్నీ' సాంగ్‌కు సితార అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోని శనివారం ఉదయం మహేశ్‌ బాబు ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. 'తన పెర్ఫార్మెన్స్‌తో మరోసారి అందర్నీ అలరించనుంది' అని సూపర్ స్టార్ పేర్కొన్నారు. ఆదివారం 'పెన్నీ' ఫుల్‌ సాంగ్‌ని విడుదల చేయనున్నారు. 

పెన్నీ సాంగ్‌లో మహేష్ బాబుతో పాటుగా సితార కూడా కన్పించడంతో సూపర్ స్టార్ అభిమానులకు అవధులు లేకుండా పోయాయి. సర్కారు వారి పాట సినిమాతో సితార మొదటిసారి సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేయనున్నారు. హాలీవుడ్‌ యానిమేషన్‌ మూవీ 'ఫ్రోజెన్ 2' తెలుగు వెర్షన్‌లో బేబీ ఎల్సా పాత్రకు సితార వాయిస్‌ ఓవర్‌ అందించిన విషయం తెలిసిందే. బ్యాంక్‌ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. 

మొదటి సింగిల్ కళావతిలో మహేష్ బాబు చాలా యవ్వనంగా, అందంగా కనిపించారు. కీర్తి సురేష్ కూడా చీరకట్టులో అందంగా ఉన్నారు. ఈ పాత యూట్యూబ్‌లో రికార్డులన్నీ బ్రేక్ చేసింది. ఇక పెన్నీ సాంగ్‌లో మహేష్ బాబుతో పాటుగా సితార కూడా కన్పించడంతో..  కళావతి కంటే ఎక్కవ వ్యూస్, లైక్స్ వచ్చే అవకాశం ఉంది. 'మార్చి 20న సర్కారు వారి పాట నుంచి సెకండ్ సింగిల్‌ రిలీజ్ అవుతుంది. మీ ఇయర్‌బడ్స్‌ మ్యూజిక్‌తో దద్దరిల్లడం పక్కా. సిద్ధంగా ఉండండి' అంటూ ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ థమన్ ట్వీట్ చేశారు.  

Also Read: Chiranjeevi vs Salman Khan: పైసల్ ఇస్తానంటే.. నేను ఇక్కడినుంచి ఎల్లిపోతా! చిరంజీవికి సల్మాన్ ఖాన్ వార్నింగ్!!

Also Read: Gambhir-Dhoni: 138 కోట్ల భారతీయ ప్రజల ముందు.. ఎంఎస్ ధోనీ గురించి ఆ మాట చెప్పగలను: గంభీర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News