Krishnamma Day 1 Collections: వైవిధ్యమైన కథలతో తెలుగు ఇండస్ట్రీలో ముందుకు సాగుతున్న హీరో సత్యదేవ్. ఈ హీరో నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. మే 10వ తేదీన విడుదలైన ఈ సినిమాకు వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. మరో చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటేప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు.
ఈ చిత్రం మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకోవడమే కాకుండా.. సత్యదేవ్‌లోని నటుడిని కొత్తగా ఆవిష్కరించిన చిత్రంగా ప్రశంసలు అందుకుంటోంది.
పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకోవడమే కాదు..
సత్యదేవ్ సినీ కెరీర్లో ‘కృష్ణమ్మ’ సినిమా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం మొదటి రోజునే 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది సత్యదేవ్ కెరియర్ లోనే ఇంత కలెక్షన్స్ అందుకున్న మొదటి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఓ వైపు ఎన్నికలు, మరో వైపు ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ నేపథ్యంలో విడుదలైన ‘కృష్ణమ్మ’కు ఇలాంటి కలెక్షన్స్ రావడం మంచి పరాణామం అంటున్నారు సినీ విశ్లేషకులు. మొత్తానికి ప్రశంసలు, కలెక్షన్లు అందుకుంటూ ఈ చిత్రం సత్యదేవ్ కెరీర్ లో బెస్ట్ మూవీ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా మిగిలింది.
మే నెలాఖరు వరకు పెద్ద సినిమా రిలీజెస్ లేనందు వల్ల కృష్ణమ్మ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈనెల ఆఖరి వరకు దూసుకుపోదాం ఖాయంలా కనిపిస్తోంది. ప్రేక్షకులను చక్కటి యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటూ థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది కృష్ణమ్మ. సత్యదేవ్ తో పాటు ఈ సినిమాలో లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, అతీరా రాజ్ కీలక పాత్రల్లో నటించారు. కాలభైరవ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించారు.
Also read: AP Election Arrangements: ఏపీ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook