Allu Aravind Four Sons: స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అల్లు అరవింద్ తొలుత ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించారు. కానీ నిర్మాణరంగం మీద ఆసక్తి చూపించడంతో అల్లు రామలింగయ్య తాను స్థాపించిన గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ ని అల్లు అరవింద్ కు అప్పజెప్పారు. ఆ తర్వాత అల్లు అరవింద్ అనేక సూపర్ హిట్ సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. అయితే ఆయన పర్శనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయనకు ముగ్గురు కుమారులు మాత్రమే అని అందరూ భావిస్తూ ఉంటారు.
ఇక అందులో అల్లు అర్జున్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన ఇటీవల పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా స్టార్ డం తెచ్చుకుని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయనకు ఒక సోదరుడు ఉన్నాడని అల్లు శిరీష్ పేరుతో ఆయన కూడా సినీ హీరోగా మారతాడని తెలిసినప్పటి నుంచి శిరీష్ గురించి కూడా తెలుగు మీడియా వల్ల ప్రేక్షకులకు చాలా వరకు విషయాలు తెలిసేవి. అల్లు శిరీష్ గౌరవం సినిమాతో హీరోగా మారి ఇటీవలే ఊర్వశివో రాక్షశివో అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.
కలెక్షన్స్ విషయంలో మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కాకుండా అల్లు అరవింద్ కి మరో కుమారుడు ఉన్నారన్న సంగతి వరుణ్ తేజ్ గని సినిమా రిలీజ్ అయ్యే వరకు చాలా మందికి తెలియదు. ఎందుకంటే గని సినిమాతోనే అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ అలియాస్ అల్లు బాబీ నిర్మాతగా మారి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమయ్యాడు. అంతకుముందు ఆయన సినిమా సర్కిల్స్ లో ఉన్న వారికి కొంతమందికి మాత్రమే తెలుసు.
అయితే అల్లు అరవింద్ కి మరో కుమారుడు ఉన్నాడనే సంగతి తాజాగా అల్లు శిరీష్ బయటపెట్టాడు. అల్లు అరవింద్ కి అల్లు వెంకటేష్ తర్వాత అల్లు రాజేష్ అనే కుమారుడు జన్మించాట. అయితే ఆయనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడట/ రాజేష్ పుట్టి మరణించే సమయానికి అల్లు శిరీష్ ఇంకా జన్మించనేలేదట. తాజాగా ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు శిరీష్ ఈ మేరకు కామెంట్స్ చేశారు. అయితే అల్లు అరవింద్ కి కేవలం ముగ్గురు కుమారులే అని అందరూ భావిస్తున్న తరుణంలో మరో కుమారుడు కూడా పుట్టి మరణించారని అల్లు శిరీష్ బయట పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Alia Bhatt discharged: లిటిల్ ఏంజెల్ తో ఇంటికి వచ్చేసిన అలియా..ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook