Shah Rukh Khan Pathaan : వందకు పైగా దేశాలు.. వేల స్క్రీన్లు.. పఠాన్‌తో షారుఖ్ నయా రికార్డ్

Shah Rukh Khan Pathaan Release బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో రేపు సందడి చేయబోతోన్నాడు. ఈ చిత్రాన్ని దాదాపు వందకు పైగా దేశాల్లో రిలీజ్ చేయబోతోన్నారట. ఇక ఓవర్సీస్‌లోనే కేవలం 2500 స్క్రీన్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారట.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2023, 12:28 PM IST
  • రేపే థియేటర్లో పఠాన్ సందడి
  • షారుఖ్ ఖాన్ సత్తా చాటే చిత్రమవుతుందా?
  • వందకు పైగా దేశాల్లో విడుదల
Shah Rukh Khan Pathaan : వందకు పైగా దేశాలు.. వేల స్క్రీన్లు.. పఠాన్‌తో షారుఖ్ నయా రికార్డ్

Shah Rukh Khan Pathaan Release బాలీవుడ్ మళ్లీ తన హవాను కొనసాగించే టైం వచ్చినట్టు కనిపిస్తోంది. వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న షారుఖ్ ఖాన్‌ సైతం తన కష్టాల్లోంచి బయట పడేట్టున్నాడు. ఒక్క పఠాన్ సినిమా అటు బాలీవుడ్, ఇటు షారుఖ్ కెరీర్‌లను మలుపు తిప్పేలా ఉంది. మరి ఈ పఠాన్ మీదున్న బజ్, అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ చూస్తే భారీ ఎత్తులో కలెక్షన్లు రాబట్టేలా ఉంది.

ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. వందకు పైగా దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారట. దాదాపు 2500 స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారట. కరోనా తరువాత ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్న చిత్రంగా పఠాన్ రికార్డులు క్రియేట్ చేస్తోంది.

పఠాన్ సినిమా ఇప్పుడు నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ సినిమాను బ్యాన్ చేయాలని, పాటను తొలగించాలని, దీపిక వేసుకున్న బట్టలు, వాటి రంగు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కొంత మంది ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. మరి రేపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

జీరో సినిమా తరువాత షారుఖ్ ఇంత గ్యాప్ తీసుకుని మళ్లి ఇప్పుడు వస్తున్నాడు. షారుఖ్‌ ఖాన్ బాలీవుడ్ బాక్సాఫీస్ బాద్ షా అని మళ్లీ నిరూపించుకుంటాడా? లేడా? అన్నది చూడాలి. సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రం షారుఖ్, దీపికలు బయటకు రావడం లేదు. తెలుగులో ఈ సినిమాను అంతగా ప్రమోట్ చేయడం లేదు. సినిమా విడుదలై సక్సెస్ అయితేనే బయటకు వచ్చేలా కనిపిస్తున్నారు.

Also Read:  Rajamouli murder Plan : రాజమౌళి హత్యకు కుట్ర.. హెచ్చరించిన రామ్ గోపాల్ వర్మ

Also Read: Thaman Trolls : ఇక్కడ శివుడంటాడు.. అక్కడ చచ్చినా పర్లేదంటాడు.. తమన్ అతి డైలాగులపై సెటైర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News