Sherlyn Chopra, Sajid Khan: ప్రముఖ దర్శకుడిపై షెర్లిన్ చోప్రా లైంగికంగా వేధింపుల కేసు

Sherlyn Chopra, Sajid Khan: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్‌పై బాలీవుడ్ నటి, మోడల్ షెర్లిన్ చోప్రా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాజిద్ ఖాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాల్సిందిగా షెర్లిన్ చోప్రా తన ఫిర్యాదులో పేర్కొంది.

Written by - Pavan | Last Updated : Oct 20, 2022, 09:31 PM IST
Sherlyn Chopra, Sajid Khan: ప్రముఖ దర్శకుడిపై షెర్లిన్ చోప్రా లైంగికంగా వేధింపుల కేసు

Sherlyn Chopra, Sajid Khan: సాజిద్ ఖాన్ మరోసారి లైంగిక వేధింపుల కేసుతో వార్తల్లోకెక్కాడు. ఈసారి సాజిద్ ఖాన్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాల్సిందిగా ఫిర్యాదు చేసింది ఎవరో కాదు.. బాలీవుడ్ నటి, మోడల్ షెర్లిన్ చోప్రానే. 2005లో సాజిద్ ఖాన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. కానీ అప్పట్లో ఇండస్ట్రీలో చాలా పలుకుబడి కలిగిన వ్యక్తిగా ఉన్న సాజిద్ ఖాన్‌పై ఫిర్యాదు చేయలేకపోయానని షెర్లిన్ చోప్రా ఆవేదన వ్యక్తంచేసింది. అయితే, మీ టూ మూవ్ మెంట్ ఇచ్చిన దైర్యంతో ఇప్పుడు సాజిద్ ఖాన్ పై ఫిర్యాదు చేస్తున్నానని షెర్లిన్ చోప్రా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సాజిద్ ఖాన్ ని జైల్లో పెట్టాలని షెర్లిన్ చోప్రా పోలీసులను విజ్ఞప్తి చేసింది.

సాజిద్ ఖాన్ పై లైంగిక వేధింపులు ఫిర్యాదులు రావడం ఇదేం తొలిసారి కాదు. 2018 లో మీ టూ మూవ్మెంట్ ఉధృతంగా ఉన్న రోజుల్లోనే సాజిద్ ఖాన్ పై బాలీవుడ్ కి చెందిన నటీమణులు, మోడల్స్ వరుసపెట్టి ఆరోపణలు గుప్పించారు. మొత్తం 9 మంది ఆర్టిస్టులు సాజిద్ ఖాన్ పై లైంగిక వేధింపుల కేసులు పెట్టారు. సాజిద్ ఖాన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వాళ్లంతా గతంలో అతడితో కలిసి సినిమాల్లో, టీవీ కార్యక్రమాల్లో వివిధ ప్రాజెక్టుల్లో కలిసి పనిచేసిన వాళ్లే కావడం గమనార్హం.

షెర్లిన్ చోప్రాతో పాటు సలోని చోప్రా, అహనా కుమ్రా, మందనా కరిమి వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు సాజిద్ ఖాన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. సాజిద్ ఖాన్ తనను నిత్యం ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొంటావని అడిగాడని ఒకరు ఫిర్యాదు చేస్తే.. నీకెంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని అడిగాడని ఇంకొకరు ఫిర్యాదు చేశారు. అన్నింటికిమించి సాజిద్ ఖాన్ తన ప్రైవేట్ పార్ట్స్ చూపించి టచ్ చేయాల్సిందిగా ఒత్తిడి చేశాడని మరొకరు ఫిర్యాదు చేశారు. ఇలా మొత్తంగా సాజిద్ ఖాన్ పై లైంగిక వేధింపుల కేసులకు లెక్కేలేదు.

Also Read : Chikoti Praveen on Bollywood actress: బాలీవుడ్ హీరోయిన్లు వచ్చేది అందుకే.. అసలు విషయం బయటపెట్టేసిన చికోటి!

Also Read : Priyamani Divorce: విడాకులకు సిద్దమైన ప్రియమణి.. అందుకే ఆరోజు నుంచే విడివిడిగా?

Also Read : Allu Arjun beats Khan's : ఖాన్స్ ను వెనక్కు నెట్టిన అల్లు అర్జున్.. బాలీవుడ్లో పుష్ప కోసమే వెయిటింగ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News