Shilpa Shetty: శిల్పా శెట్టికి కోర్టు సమన్లు.. అప్పు తిరిగి చెల్లించలేదని..!

Shilpa Shetty: శిల్పా శెట్టి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అమెతో పాటు చెల్లెలు షమితా శెట్టి, తల్లి సునందా షెట్టికి కోర్టు సమన్లు పంపింది. అప్పు తిరిగి చెల్లించలేదని ఓ వ్యాపరస్తుడి ఫిర్యాదు మేరకు నోటీసులు పంపింది న్యాయ స్థానం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2022, 11:18 AM IST
  • మరోసారి వివాదంలో శిల్పా శెట్టి
  • అప్పు తిరిగి చెల్లించలేదని కోర్టుని ఆశ్రయించిన వ్యక్తి
  • శిల్పా శెట్టి సహా తల్లి, సోదరికీ న్యాయస్థానం సమన్లు
Shilpa Shetty: శిల్పా శెట్టికి కోర్టు సమన్లు.. అప్పు తిరిగి చెల్లించలేదని..!

Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కుంద్రా, సోదరి షమితా శట్టి, తల్లి సునందా శెట్టిలకు ముంబయిలోని అందేరీ కోర్టు సమన్లు జారీ చేసింది. రూ.21 లక్షల రుణం తిరిగి చెల్లించలేదని ఓ వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు సమన్లు జారీ చేసింది.

ఈ ముగ్గురు ఈ నెల 28న విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ విషయాన్ని వార్తా సంస్థ ఏఎన్​ఐ తెలిపింది.

అప్పు ఎప్పుడు తీసుకున్నారంటే..

మరో ఆంగ్ల వార్తా సంస్థ కథనం ప్రకారం.. శిల్పా శెట్టి తండ్రి సురేంద్ర శెట్టి ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని నుంచి 2015లో రూ.21లు రుణం తీసుకున్నారు. ఈ రుణాన్ని 2017 జనవరి వరకు చెల్లించాల్సి ఉంది. అయితే సురేంద్ర శెట్టి 2016 అక్టోబర్ 11న మృతి చెందారు.

అయితే ఆయన చేసిన అప్పు గురించి కూతురు, తల్లికి తెలుసని ఆ వ్యక్తి తెలిపాడు. అయినప్పటికీ.. వాళ్లు తన డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించినట్లు ఆరోపించాడు. సురేంద్ర శెట్టి తన వద్ద  18 శాతం వార్షిక వడ్డీకి ఆ మొత్తం రుణం తీసుకున్నట్లు వివరించాడు.

ఇక కోర్టు నోటీసులపై శిల్పా శెట్టి, షమితా శెట్టి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

శిల్పా శెట్టి ప్రస్తుతం 'ఇండియా గాంట్ టాలెంట్​' రియాలిటీ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. షమితా శెట్టి బిగ్​బాస్ 15ల చివరి సారిగా కనిపించారు.

Also read: DJ Tillu Review: డీజే టిల్లు బాక్సులు బద్దలు కొట్టాడా?

Also read: Bollywood Bold Actress: బోల్డ్‌నెస్‌లో హద్దులు దాటేస్తున్న బాలీవుడ్ అందాల తారలు వీళ్లే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News