DJ Tillu Review: డీజే టిల్లు బాక్సులు బద్దలు కొట్టాడా..? సినిమా అదుర్స్

DJ Tillu Review: నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీజే టిల్లు సినిమా ఎలా ఉంది? సిద్ధూ జొన్నల గడ్డకు మరో హిట్టు పడినట్లేనా? సినిమా ఫుల్​ రివ్యూ మీ కోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 10:41 AM IST
  • థియేటర్లలో డీజే టిల్లు సందడి
  • ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబడుతున్న డీజే టిల్లు
  • సిద్ధూ జొన్నలగడ్డ నటనకు మంచి మార్కులు
DJ Tillu Review: డీజే టిల్లు బాక్సులు బద్దలు కొట్టాడా..? సినిమా అదుర్స్

DJ Tillu Review: సిద్దూ జొన్నల గట్డ, నేహా శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన డీజే టిల్లు.. (అట్లుంటది మనతోని అనే ట్యాగ్​లైన్​తో) సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. సినిమా విడుదలకు ముందే.. రిలీజ్ చేసిన మాస్​ సాంగ్స్​, కామెడీ డైలాగ్స్​ మూవీపై భారీ అంచనాలు పెంచేసిన విషయం తెలిసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? వీటన్నిటితో పాటు సినిమా పూర్తి రివ్యూ మీ కోసం.

సినిమా గురించి..

ఈ సినిమాలో సిద్దూ జొన్నలగడ్డ, నేహా శెట్టి, బ్రహ్మజీ, ప్రిన్స్ తదితరులు నటించారు.

కథ, దర్శకత్వం- విమల్ కృష్ణ, సిద్దూ జొన్నలగడ్డ డైలాగ్స్​ కూడా రాయడం విశేషం.

సంగీతం తమన్​. (డీజే టిల్లు పాటకు రామ్ మిర్యాల)

ఈ సినిమాను సితారా ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్​పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.

ఏమిటి సినిమా కథ..

డీజేగా పని చేస్తూ.. సినిమాకు మ్యూజిక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ యువకుడు.. హీరియిన్​తో పరిచయం ఏర్పడటం వల్ల.. అమెతో పాటు ఓ మర్డర్​ కేసులో ఇరుక్కుని.. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అన్నదే సినిమా ప్రధాన కథాంశం.

డీజే టిల్లు (సిద్ధూ జొన్నల గడ్డ) అసలు పేరు బాలగంగాధర్ తిలక్​. అయితే దానిని డీజే టిల్లుగా మార్చుకుంటాడు హీరో. దీనితో బయట అందరూ అదే పేరుతో పిలుస్తుంటారు.

డీజే టిల్లూ.. మ్యూజిక్​ మాత్రమే కాకుండా.. మాటలతోనూ అందరిని ఆకర్శిస్తుంటాడు. అలా ఓ రోజు సింగర్​ రాధిక (నేహా శెట్టి)ని చూసి మనసు పారేసుకుంటాడు.

ఆమె అంటే ఇష్టం ఏర్పడి.. అమెను తన మాటలతో మైపరిపించి ప్రేమలో పడతాడు.

అయితే అనుకోకుండా.. రాధిక ఓ మర్డర్​ కేసులో ఇరుక్కుంటుంది. డీజే టిల్లూ కూడా అమెతో పాటు ఉండటం వల్ల అందులో ఇరుక్కుంటాడు. ఆ హీరో, హీరోయిన్​ మర్డర్​ కేసు నుంచి బయటపడేందుకు ఏం చేశారు? అసలు మర్డర్ అయ్యింది ఎవరు? హీరోయిన్ నిజంగానే మర్డర్​ చేసిందా? అనేది తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే.

మర్డర్ మిస్టరీ అయినప్పటికీ సినిమా ఆధ్యాంతం కామెడితో ఉంటుంది. సినిమాలో డీజే టిల్లు క్యారెక్టర్​ ప్రత్యేకంగా నిలుస్తుంది. హీరో మాటలు, చేసే పనులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి.

కథ సాగుతున్న కొద్ది.. బ్రహ్మాజీ, ప్రిన్స్ సహా ఇతర క్యారెక్టర్లు స్టోరీలోకి ఎంటర్ అవుతాయి. దీనితో సినిమా మరింత ఇంట్రెస్టింగ్​గా మారుతుంది.

ఈ సినిమాలో డీజే టిల్లుగా సిద్ధూ జొన్నలగడ్డ వన్​ మ్యాన్​ షో అని చెప్పొచ్చు. హీరోయిన్​గా నేహా శెట్టి అద్భుతంగా రాణించింది. బ్రహ్మాజీ, ప్రిన్స్​, ప్రగతి వంటి యాక్టర్స్​ తమ పరిధి మేరకు మెప్పించారు.

ఇక సినిమాకు పాటలు ప్రత్యేక బలం అని చెప్పొచ్చు. డీజే టిల్లు సాంగ్​ను​ యూత్​ తెగ ఎంజాయ్ చేస్తారు. ఇతర పాటలు కూడా చాలా బాగున్నాయి. మొత్తం మీద, కృష్ణా అండ్ హిస్ లీలా, మా వింత గాధ వినుమా వంటి సినిమాల తర్వాత సిద్దూ మరోసారి కొత్త రకమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు.

Also read: Bhamakalapam review: ట్విస్టులతో 'భామా కలాపం'- ఫుల్ మూవీ రివ్యూ..

Also read: Prema Entha Madhuram: వాలెంటైన్స్ డే స్పెషల్.. రియల్ కపుల్స్‌తో ప్రేమ ఎంత మధురం టైటిల్ సాంగ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo

Trending News