Shilpa Shetty Mother : హాస్పిటల్ బెడ్డు మీదున్న తల్లి కోసం శిల్పా శెట్టి ఆవేదన.. ప్రార్థించండంటూ ఎమోషనల్ పోస్ట్

Shilpa Shetty Mother శిల్పా శెట్టి తాజాగా తన తల్లి గురించి ఆందోళన చెందుతోంది. సర్జరీ జరిగిందని, త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించండి అంటూ ఇన్ స్టా ఫ్యామిలీని వేడుకుంది శిల్పా శెట్టి. తాజాగా ఆమె వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2023, 01:09 PM IST
  • హాస్పిటల్‌లో శిల్పా శెట్టి తల్లి
  • సర్జరీ జరిగిందంటూ ఎమోషనల్
  • అందరూ ప్రార్థించండని కోరిన హీరోయిన్
Shilpa Shetty Mother : హాస్పిటల్ బెడ్డు మీదున్న తల్లి కోసం శిల్పా శెట్టి ఆవేదన.. ప్రార్థించండంటూ ఎమోషనల్ పోస్ట్

Shilpa Shetty Mother Underwent Surgery శిల్పా శెట్టి తాజాగా తన తల్లి కోసం తల్లడిల్లిపోతోంది. ఆమెకు సర్జరీ జరిగిందని, త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అంటూ తన ఇన్ స్టా ఫాలోవర్లను వేడుకుంది. అందరూ తన అమ్మ కోసం ప్రార్థించండి అంటూ శిల్పా శెట్టి వేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ ప్రముఖులతో పాటుగా శిల్పా శెట్టి ఫాలోవర్లు సైతం అమ్మ కోసం ప్రార్థిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని దేవుడ్ని వేడుకుంటున్నారు.

మన తల్లిదండ్రులు ఇలా హాస్పిటల్ బెడ్డు మీద ఉండటం, సర్జరీలు జరగడం ఓ బిడ్డగా చూడటం, ఆ బాధను అనుభవించడం ఎంతో కష్టం. కానీ మా అమ్మ ధైర్యం, ఫైటింగ్ స్పిరిట్‌ నాకు ఎంతో ఇష్టం. ఆమె ఎంతో ధైర్యవంతురాలు.. ఆ ధైర్యమే నాకు ఇష్టం. నాకు గత కొన్ని రోజుల నుంచి ఎంతో కష్టంగా గడిచింది. కానీ మా హీరో, మా డాక్టర్.. మా తల్లి ప్రాణాలను కాపాడారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

డా. రాజీవ్ భగవత్ మా అమ్మను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. సర్జరీ జరగక ముందు, జరిగిన తరువాత కూడా అమ్మను ఎంతో కేరింగ్‌గా చూసుకున్నారు. నానావతి హాస్పిటల్ స్టాఫ్‌కు థాంక్స్. మా అమ్మ ఇంకా పూర్తిగా కోలుకోవాలని ఆ దేవుడ్ని కోరుకోండి.. ప్రార్థించండి. ఈ ప్రార్థనలే అద్భుతాలను చేయగలవు అంటూ శిల్పా శెట్టి ఎమోషనల్ అయింది.

శిల్పా శెట్టికి ప్రస్తుతం టైం బ్యాడ్‌గానే నడుస్తోంది. గత ఏడాది అంతా కూడా తన భర్త కేసుల్లో చిక్కుకోవడం, మీడియాలో, సోషల్ మీడియాలో శిల్పా శెట్టి పరువుపోవడం, ట్రోల్స్, మీమ్స్ రావడం అందరికీ తెలిసిందే. తన భర్త చేసిన తప్పుల్లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, శృంగార వీడియోలు తీస్తున్నాడని తనకు తెలియదంటూ తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ పేరును ఇలా చెడగొట్టొద్దంటూ మీడియాను శిల్పా శెట్టి వేడుకున్న సంగతి తెలిసిందే.

Also Read:  Shruti Haasan : నెటిజన్ల తిక్క ప్రశ్నలు.. శ్రుతి హాసన్‌ సమాధానాలివే.. ఛీ ఛీ ఇదేం దరిద్రం!

Also Read: Nidhhi Agerwal : జోరు పెంచేసిన నిధి అగర్వాల్.. అదరహో అనాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x