Siddharth Come Back: చాలా కాలం తరువాత తెలుగు సినిమా చేస్తున్న సిద్ధార్థ్

Siddharth Come Back |  బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి  సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సిద్దార్థ్.  

Last Updated : Oct 31, 2020, 06:20 PM IST
    • బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సిద్దార్థ్.
    • తమిళంతో పాటు హిందీ సినిమాలు చేయడంలో బిజిగా మారిన సిద్దూ చాలా కాలం నుంచి డైరక్ట్ తెలుగు సినిమా చేయలేదు.
    • ఈ లోటును పూర్తి చేయడానికి సిద్ధూ పూర్తిగా సిద్ధం అయ్యాడు.
Siddharth Come Back: చాలా కాలం తరువాత తెలుగు సినిమా చేస్తున్న సిద్ధార్థ్

Siddharth Come Back: బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి  సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సిద్దార్థ్.  తమిళంతో పాటు హిందీ సినిమాలు చేయడంలో బిజిగా మారిన సిద్దూ ( Siddharth ) చాలా కాలం నుంచి డైరక్ట్ తెలుగు సినిమా చేయలేదు. ఈ లోటును పూర్తి చేయడానికి సిద్ధూ పూర్తిగా సిద్ధం అయ్యాడు. తను చాలా కాలం తరువాత తెలుగు సినిమాలో ( Tollywood ) కనిపంచనున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించాడు ఈ హ్యాండ్సమ్ హీరో.

Also Read | Rythu Vedika: రైతు వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఒక ఓటీటీ ( OTT ) వేదికలో నవరస అనే సినిమా చేయడానికి అంగీకరించిన సిద్ధూ ఇక తన సినిమాల స్పీడును పెంచడానికి నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే తెలుగు సినిమా చేయడానికి కూడా అంగీకరించాడు. 

సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో అంతగా యాక్టివ్ లేని సిద్దార్థ్ ఈ విధంగా ట్వీట్ చేశాడు.

Also Read | Prabhas: ప్రభాస్ మూవీలో కృతి సనన్ ?

"Starting work on my first #Telugu film in 8 years #mahasamudram next month. Like I said I would, I'm coming back, and I'm doing so with a great team and cast of Co-actors. Chaalaa anandhanga undhi. Need your wishes:) @ImSharwanand @aditiraohydari @AnilSunkara1 Ajay Bhupathi.

ఎనిమిది సంవత్సరాల తరువాత మరో తెలుగు సినిమా చేస్తున్నాను. మహాసముద్రంతో మీ ముందుకు రానున్నాను. నేను ఎప్పటికైనా తిరిగి వస్తాను అన్నాను.. అలాగే తిరిగి వస్తున్నాను. మంచి టీమ్ , మంచి కోస్టార్స్ తో ఈ సినిమా చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదాలు కావాలి అని ట్వీట్ చేశాడు. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News