Lata Mangeshkar health: విషమంగా లతా మంగేష్కర్ ఆరోగ్యం- వెంటిలేటర్​పై చికిత్స!

Lata Mangeshkar health: దిగ్గజ గాయని లతా మంగేష్కర్​ ఆరోగ్యం విషమించింది. మరోసారి అమెకు వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు వైద్యులు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2022, 04:02 PM IST
  • క్షీణించిన లతా మంగేష్కర్​ ఆరోగ్యం
  • వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యుల వెల్లడి
  • గత నెలలో కొవిడ్ బారిన పడిన లెజెండరీ సింగర్​
Lata Mangeshkar health: విషమంగా లతా మంగేష్కర్ ఆరోగ్యం- వెంటిలేటర్​పై చికిత్స!

Lata Mangeshkar health: ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్​ ఆరోగ్య పరిస్థితి మరోసారి క్షీణించింది. అమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ముంబయిలోని బ్రిచ్​ క్యాండీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించినట్లు వార్తా సంస్థ ఏఎన్​ఐ పేర్కొంది.

లతా మంగేష్కర్​కు ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె ఆరోగ్యంపై వైద్యులు నిరంతం పర్యేవేక్షిస్తున్నట్లు వివరించారు.

కోవిడ్-19 సోకడంతో గత నెలలో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేరారు లతా మంగేష్కర్​. అప్పుడు కూడా అమె పరిస్తితి క్షీణించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.

అయితే కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అమెకి ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్​ కారణంగా చికిత్స తీసుకుంటున్నారు. లతా మంగేష్కర్​ వయసు 92 ఏళ్లు. అందుకే అమె కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ఇతర సమస్యల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.

ఇక లతా మంగేష్కర్​ ఆరోగ్యంపై అమె సోషల్​ మీడియా టీమ్​ ఎప్పటికప్పుడు అప్​డేట్స్ ఇస్తుంటుంది. పుకార్లను నమ్మోద్దంటూ సూచనలు కూడా చేస్తుంటుంది.

లతా మంగేష్కర్​ గురించి..

భారత లెజెండరీ సింగర్స్​లో లతా మంగేష్కర్​ కూడా ఒకరు. క్వీన్ అఫ్​ మెలోడిగా అమెను పిలుస్తుంటారు. 1942 నుంచి అమె పాటలు పాడుతున్నారు.

సంగీత కళలో.. అమె అందించిన సేవలకు గుర్తింపుగా.. 1969లో పద్మ భూషణ్​, 1989లో దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డు, 1997లో మహారాష్ట భూషణ్​, 1999లో పద్మ విభూషణ్​, 2001లో భారత రత్న అందుకున్నారు. ఇవే కాక ఎన్నో ఫిల్మ్​ఫేర్​లు జాతీయ అవార్డులు అందుకున్నారు లతా మంగేష్కర్​. హిందీ, మరాఠీ, బెంగాలీ సహా ఇతత ప్రాంతీయ భాషల్లోను అమె పాటలు పాడారు.

Also read: Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 సినిమాలు, 75 మిలియన్ల వ్యూస్

Also read: Sridevi Remuneration: మెగాస్టార్ చిరంజీవితో సమానంగా పారితోషికం తీసుకున్న నటి ఎవరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News