Kichha Sudeep on Hindi : హిందీ ఇక ఎంత మాత్రం జాతీయ భాష కాదు : కిచ్చ సుదీప్, యష్ KGF 2పై ప్రశంసలు

Kichha Sudeep on Hindi : ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్న 'కేజీఎఫ్: చాప్టర్ 2' భారీ విజయం సాధించడంపై యష్‌పై ప్రముఖ కన్నడ నటుడు కిచ్చ సుదీప్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇకపై హిందీ ఎంతమాత్రం జాతీయ  భాష కాదన్నారు సుదీప్.

Last Updated : Apr 25, 2022, 07:19 PM IST
Kichha Sudeep on Hindi : హిందీ ఇక ఎంత మాత్రం జాతీయ భాష కాదు : కిచ్చ సుదీప్, యష్ KGF 2పై ప్రశంసలు

Kichha Sudeep on Hindi : ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్న 'కేజీఎఫ్: చాప్టర్ 2' భారీ విజయం సాధించడంపై యష్‌పై ప్రముఖ కన్నడ నటుడు కిచ్చ సుదీప్ ప్రశంసల జల్లు కురిపించాడు. తాజాగా ఆర్ ది డెడ్లీయెస్ట్ గ్యాంగ్‌స్టర్ ఎవర్ (R: The Deadliest Gangster Ever) ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్నాడు సుదీప్. బాలీవుడ్ సినిమాల్లో కనిపించని ప్రాంతీయ భాషా చిత్రాల శక్తి సామర్థ్యాలు, నాణ్యత గురించి సుదీప్ మాట్లాడాడు.

పాన్-ఇండియా చిత్రాలపై ఎవరో చేసిన వ్యాఖ్యను ప్రస్తావించిన సుదీప్... హిందీ ఇకపై ఎంత మాత్రం జాతీయ భాష కాదని పేర్కొన్నాడు.

ట్రైలర్ లాంచ్‌ కార్యక్రమంలో సుదీప్ మాట్లాడుతూ, "ఓ పాన్ ఇండియా సినిమాను కన్నడలో తీశారని ఎవరో చెప్పారు. నేను చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నాను. హిందీ ఇకపై జాతీయ భాష ఎంత మాత్రం కాదు.

బాలీవుడ్ మేకర్స్ పాన్-ఇండియా సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు. కానీ అవి విజయం సాధించడం లేదు. కానీ ఇప్పుడు మనం అంతటా విజయవంతమవుతున్న సినిమాలు చేస్తున్నాం." అన్నాడు సుదీప్.

దేశవ్యాప్తంగా ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని స్వీకరించాలని హోంమంత్రి అమిత్ షా దేశపౌరులను కోరిన కొద్ది వారాలకే సుదీప్ నుంచి ప్రకటన వెలువడింది. హిందీ భాష తెలియని వారిపై బలవంతంగా ఒత్తిడి తేవడం సరికాదని పలువురు రాజకీయ నేతల నుంచీ విమర్శలు వెల్లువెత్తాయి. దేశంలోని ప్రతి ఒక్కరిపై ఒక భాషను బలవంతంగా రుద్దడం సరికాదని పలువురు ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

యష్ చిత్రం 'కేజీఎఫ్: చాప్టర్ 2', ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను తన వశం చేసుకుంటోంది. తిరుగులేని విధంగా వసూళ్లను కొల్లగొడుతోంది. ఇది ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకుంది. ఈ క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా లేదు.

విడుదలైన మొదటి వారంలోనే ఈ చిత్రం రూ.720.31 కోట్లు రాబట్టి దేశవ్యాప్తంగా అందరినీ షాక్‌కు గురిచేసింది. రెండవ వారంలో, ఇది శుక్రవారం నాటికి రూ. 776.58 కోట్ల వసూళ్లు సాధించింది. రెండవ వారాంతం ముగిసే సమయానికి రూ. 800 కోట్లను దాటింది. ఇప్పటి వరకు మొత్తం కలెక్షన్స్ రూ. 880 కోట్లు దాటాయి.

Also Read : PF Account: మారిన పీఎఫ్ నిబంధనలు, కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ట్యాక్స్

Also Read : నేను లైంగిక వేధింపులకు గురయ్యా.. బాలీవుడ్ క్వీన్ కంగ‌నా షాకింగ్ కామెంట్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News