Sree Leela Offers: లక్కు తోక తొక్కిన శ్రీ లీల.. ఇద్దరు స్టార్ హీరోలతో సందడి!

Sree Leela Back to Back Offers: యంగ్ హీరోయిన్ శ్రీ లీల వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది, ఆమె ఏకంగా మహేష్ బాబు, అల్లు అర్జున్ సరసన నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు   

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 27, 2022, 03:00 PM IST
Sree Leela Offers: లక్కు తోక తొక్కిన శ్రీ లీల.. ఇద్దరు స్టార్ హీరోలతో సందడి!

Sree Leela in SSMB 28: పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సురపనేని శ్రీ లీల. ఆమె అప్పటికే కన్నడ సినిమాల్లో నటించింది కానీ ఆమెకు తెలుగు నాట సూపర్ క్రేజ్ తీసుకువచ్చిన సినిమా ఏది అంటే పెళ్లి సందD అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఆమె వరుస ప్రాజెక్టుల్లో బిజీ అవుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆమె రవితేజ హీరోగా నటిస్తున్న ధమాకా అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

త్రినాధరావు నచ్చిన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఆమె రవితేజ సరసన ఆడిపాడుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆమెకు మరిన్ని ప్రాజెక్టులు చేతికి వచ్చాయని తెలుస్తోంది. తాజాగా శ్రీ లీల మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర దక్కించుకుందని తెలుస్తోంది. 

Sree Leela in Tillu Square: ఇక ఈ సినిమా కాకుండా ఆమె డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ లో కూడా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమా కోసం ముందుగా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారు కానీ ఆమె ఎందుకో సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ అవకాశం శ్రీ లీలకు దక్కినట్టుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాలు కాకుండా ఆమె అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కూడా కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆమె బాలకృష్ణ కుమార్తె పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. 

Sree Leela With Allu Arjun: ఇక ఇవి కాకుండా ఆమె అల్లు అర్జున్ తో పాటు కూడా కలిసి నటించింది. అయితే అది సినిమా కాదు ఒక యాడ్ ఫిలిం అని తెలుస్తోంది.  త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ శ్రీ లీల ప్రధాన పాత్రలలో ఒక యాడ్ షూటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన షూటింగ్ ఈరోజే జరిగినట్లు చెబుతున్నారు. అలా మొత్తం మీద శ్రీ లీల వరుసగా బడా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ అతి తక్కువ కాలంలోనే బిజీయస్ట్ హీరోయిన్గా మారిపోతోంది. కన్నడ నాట కూడా ఆమె ఒక పాన్ ఇండియా మూవీలో భాగమైంది. గాలి కిరీటి రెడ్డి హీరోగా లాంచ్ అవుతున్న సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read: Prabhas Head Cap: ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా తలకు క్యాప్ ఉండాల్సిందే.. దానికి రీజన్ తెలిస్తే షాక్ అవుతారు.?

Also Read: HIT 2 Business: దుమ్ము రేపిన హిట్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్.. శేష్ కెరీర్లోనే హయ్యెస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News