Sreeja Konidela Preetham Jukalkar : ప్రీతమ్‌ జుకల్కర్‌తో శ్రీజ కొణిదెల.. పార్టీలో చిరు చిన్నకూతురు సందడి

Sreeja Konidela with Preetham Jukalkar శ్రీజ కొణిదెల ప్రస్తుతం తన ఫ్రెండ్స్, పార్టీలంటూ ఫుల్ తిరిగేస్తోంది. వీకెండ్ పార్టీలంటూ సందడి చేస్తోంది. అయితే ఇప్పుడు శ్రీజ ప్రీతమ్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2023, 10:59 AM IST
  • సమంతకు దూరంగా ప్రీతమ్‌?
  • శ్రీజ కొణిదెలతో సమంత స్టైలిష్ట్
  • వీకెండ్ పార్టీలో చిరు చిన్నకూతురు
Sreeja Konidela Preetham Jukalkar : ప్రీతమ్‌ జుకల్కర్‌తో శ్రీజ కొణిదెల.. పార్టీలో చిరు చిన్నకూతురు సందడి

Sreeja Konidela with Preetham Jukalkar సెలెబ్రిటీలు ఎక్కువగా ఫ్యాషన్ డిజైనర్లు, స్టైలిష్ట్‌లను మెయింటైన్ చేస్తుంటారు. ఎక్కడికి వెళ్లాలన్నా, ఈవెంట్‌కు వెళ్లాలన్నా, వీకెండ్ పార్టీలకు బయటకు వెళ్లాలన్నా కూడా స్పెషల్ డిజైనర్ దుస్తులు ధరిస్తుంటారు. అందుకే సినీ ప్రపంచంలో స్టైలిష్ట్‌లు, ఫ్యాషన్ డిజైనర్లకు అంత డిమాండ్ ఉంటుంది. తెలుగులో ప్రీతమ్ జుకల్కర్ దాదాపు సెలెబ్రిటీలందరికీ డిజైనర్‌గా ఉంటాడు. సమంత డిజైనర్‌గా ముందు ఫేమస్ అయ్యాడు ప్రీతమ్.

ప్రీతమ్ ఒళ్లో కాళ్లు పెట్టి అలా పడుకున్న సమంత ఫోటో నెట్టింట్లో ఎంతగా ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ ఫోటోను షేర్ చేస్తూ ప్రీతమ్‌కు సమంత ఐ లవ్యూ కూడా చెప్పింది. సమంతకు కూడా ప్రీతమ్ ఎన్నో సార్లు లవ్యూ చెప్పాడు. కాకపోతే సమంతను ప్రీతమ్ ఎప్పుడూ కూడా అక్కా అని పిలిచేవాడు. కానీ జనాలు మాత్రం ఈ ఇద్దరికీ ఇల్లిగల్‌ అఫైర్‌ను అంటగడుతుండేవారు. విడాకులకు కారణం కూడా ఈ ప్రీతమ్ అంటూ రూమర్లు వచ్చాయి.

ప్రీతమ్ మీద తన గురించి వచ్చిన రూమర్లపై సమంత ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రీతమ్ సమంత సాధన సింగ్‌లు సెట్స్ మీద ఎంతో అల్లరి చేస్తుంటారు. సమంత చుట్టే ఈ ఇద్దరూ ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారింది. ఈ ముగ్గురూ కలిసి కనిపించి చాలా రోజులే అవుతోంది.

కేవలం సమంతకే కాకుండా ప్రీతమ్ ఇంకా స్నేహా రెడ్డి, శ్రీజ కొణిదెలకు డిజైనర్‌గా వ్యవహరిస్తుంటాడు. తాజాగా శ్రీజ ప్రీతమ్ కలిసి కనిపించారు. వీకెండ్‌ పార్టీలో వీరంతా సందడి చేసినట్టుగా ఉంది. ప్రీతమ్ స్పెషల్‌గా డిజైన్ చేసిన దుస్తులనే శ్రీజ ధరించినట్టుగా కనిపిస్తోంది.

శ్రీజ ఇప్పుడు కళ్యాణ్‌ దేవ్‌కు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. తమ మధ్య పెరిగిన దూరానికి, విడాకుల వరకు వచ్చిన విషయాన్ని ఇంత వరకు అధికారికంగా అయితే ఎక్కడా ప్రకటించలేదు. కానీ శ్రీజ మాత్రం తన ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఫుల్ చిల్ అవుతోంది. 

Also Read:  Taraka Ratna Death Live Updates: 'మోకిల' నివాసానికి చేరుకున్న తారకరత్న భౌతికకాయం..భోరున విలపిస్తున్న నందమూరి కుటుంబం

Also Read: Taraka Ratna Siva Devotee: శివుని భక్తునిగా నటించి శివరాత్రి రోజే శివైక్యం.. శివుని ఆన లేనిదే చీమైనా కుట్టునా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News