Modi 3.0 Oath ceremony: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇచ్చిన మోదీ.. ప్రమాణ స్వీకారం వేళ ఊహించని ట్విస్ట్..

Pm modi: ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ఈరోజు (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే మోదీ ప్రమాణ స్వీకారానికి అనేక దేశాల నుంచి అతిథులు,  రాష్ట్రాల సీఎంలు, అన్ని పొలిటికల్ పార్టీలను మోదీ ప్రత్యేకంగా ఆహ్వనించారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 9, 2024, 02:43 PM IST
  • పవన్ కు ఊహించని పరిణామం..
  • ఆందోళనలో జనసైనికులు..
Modi 3.0 Oath ceremony: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇచ్చిన మోదీ.. ప్రమాణ స్వీకారం వేళ ఊహించని ట్విస్ట్..

Modi big twist to janasena pawan kalyan: దేశంలో మోదీ హ్యట్రిక్ ప్రధానిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రజలు మాత్రం ఈసారి సార్వత్రిక ఎన్నికలలో దేశంతో పోటు, ఇరు తెలుగు స్టేట్స్ లలో వినూత్నంగా ఎన్నికల ఫలితాలు అందించారు. అప్ కీ బార్ సార్ సో పార్ అన్న మోదీకి కనీసం మ్యాజిక్ ఫిగర్ సీట్లు గెలుచుకోలేని విధంగా ఓట్లు వచ్చాయి. ఇక ఏపీలో కూడా జగన్ కు వైనాట్ 175 అన్న జగన్ కు.. కేవలం.. 11 స్థానాలకు పరిమితం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగైందని కూడా చెప్పుకొవచ్చు. 

Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..

ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తన మిత్ర పక్ష పార్టీలపై ఆధారపడాల్సి వచ్చింది. దీంతో ప్రధాని మోదీ, చంద్రబాబు, నితీష్ లపై ఆధారపడ్డారు. అదే విధంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా బరిలో దిగి, వైఎస్సార్సీపీని చిత్తుగా ఓడించాయి. దీంతో కేంద్రంలో మోదీకి అనుకున్న సీట్లు రాకపోవడంతో, బీజేపీ పెద్దలు ఇటు చంద్రబాబు, నితీష్ కుమార్ తో మంతనాలు జరిపారు. 

దీంతో వారు మోదీకి తమ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో మోదీ మూడోసారి పీఎం కావడానికి కావాల్సిన సంఖ్యాబలం చేకూరింది. ఇదిలా ఉండగా.. ఏపీ రాజకీయాల్లో ఈసారి జనసేక అధినేత పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. జనసేన నుంచి బరిలోకి దిగిన  వారంతా గెలిచి వందశాతం స్ట్రైక్ రేట్ సాధించారు. మోదీ 3.0 క్యాబినేట్ లో.. ఏపీ ప్రాధాన్యత ఉంటుందని అందరు భావించారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి ఇద్దరు ఎంపీలు, జనసేన నుంచి మోదీ క్యాబినేట్ లో ఒకరు ఉండోచ్చన్న ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున విన్పించాయి. ముఖ్యంగా.. మచిలీ పట్నం నుంచి బాలశౌరీ కి మోదీ క్యాబినేట్ లో బెర్తు ఖాయమని వార్తలు జోరుగా షికార్లు చేశాయి.  

కానీ బీజేపీ  కేంద్ర నాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఇప్పటికే.. కేంద్ర మంత్రివర్గంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌లకు మంత్రిపదవి దక్కింది. క్యాబినెట్ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మకు కూడా మోదీమంత్రి వర్గంలో చోటు లభించినట్లు తెలుస్తోంది. ఆయన నరసాపురం నుంచి ఎంపీగా గెలిచారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కూడా కేంద్ర మంత్రుల జాబితా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సదరు ఎంపీలంతా ఢిల్లీకి చేరుకున్నారు.

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

అయితే.. మోదీ ప్రమాణ స్వీకారం వేళ తమ అభిమాన నేత.. పవన్ కళ్యాణ్ కు మోదీ క్యాబినేట్ లో ఏదైన మంచి పదవీ ఉంటుందని ఆయన పార్టీ నేతలు, అభిమానులు భావించారు. కానీ అందరికి షాక్ ఇచ్చేలా బీజేపీ పెద్దలు జనసేన పార్టీకి ఎలాంటి పదవీ ఇవ్వలేదు. అంతేకాకుండా.. తక్కువ ఎంపీ స్థానాలున్న వారికి మొదటి దఫాలో బెర్త్ లు ఇవ్వలేమని కొందరు బీజేపీ నేతలన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరీకి లోక్ సభ స్పీకర్ పదవి ఇవ్వోచని కూడా చర్చ జోరుగా సాగుతుంది. ఈరోజు సాయంత్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనసైనికులు, పవన్ అభిమానులు మాత్రం ఒకింత నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News