Chandrababu Naidu New Cabinet List: ఆంధ్రప్రదేశ్‌లో కొలువు దీరనున్న కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయనే అంశంపై ఆసక్తి నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏకంగా 164 సీట్లు సాధించడంతో మంత్రివర్గ కూర్పు చంద్రబాబుకు సవాల్‌గా మారింది. మొత్తం 25 మంది మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీకి మూడు నుంచి నాలుగు.. బీజేపీకి రెండు వరకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కేబినెట్‌లో చేరాలని చంద్రబాబు కోరినట్లు తెలిసింది. పవన్ కూడా సుముఖత వ్యక్తం చేశారని.. డిప్యూటీ సీఎం పదవితోపాటు పవన్ కోరిన శాఖలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణల ఆధారంగా కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సీనియర్లతో పాటు జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గ కూర్పుపై నారా లోకేష్ ముద్ర ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. లోకేష్ టీమ్‌కు మెజార్టీ పదవులు వస్తాయనే చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది. మంత్రివర్గ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంత్రి పదవుల రేసులో ఈ నాయకులు ఉన్నారు.. (ఉమ్మడి జిల్లాల వారీగా)
కృష్ఠా జిల్లా
==> కొల్లు రవీంద్ర (టీడీపీ)
==> సుజనా చౌదరి (బీజేపీ)
==> కామినేని శ్రీనివాస్ (బీజేపీ)
==> మండలి బుద్ద ప్రసాద్ (జనసేన)
నెల్లూరు జిల్లా
==> నారాయణ (టీడీపీ)
==> కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (టీడీపీ)
==> సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (టీడీపీ)
==> ఆనం రాంనారాయణ రెడ్డి (టీడీపీ)
గుంటూరు జిల్లా
==> నారా లోకేష్ (టీడీపీ)
==> నాదెండ్ల మనోహర్ (జనసేన)
==> ధూళిపాళ నరేంద్ర (టీడీపీ)
==> తెనాలి శ్రవణ్ కుమార్ (టీడీపీ)
శ్రీకాకుళం
==> అచ్చెన్నాయుడు (టీడీపీ)
==> కొండ్రు మురళీ మోహన్ (టీడీపీ)
==> కూన రవి కుమార్ (టీడీపీ)
==> గౌతు శిరీష (టీడీపీ)
విజయనగరం జిల్లా
==> కిమిడి కళా వెంకటరావు (టీడీపీ)
==> ఆదితి విజయలక్ష్మి (టీడీపీ)
విశాఖపట్నం జిల్లా
==> కొణతాల రామకృష్ణ (జనసేన)
==> గంటా శ్రీనివాసరావు (టీడీపీ)
==> అయ్యన్నపాత్రుడు (టీడీపీ)
==> వంగలపూడి అనిత (టీడీపీ)
==> విష్ణుకుమార్ రాజు (బీజేపీ )
తూర్పుగోదావరి జిల్లా
==> పవన్ కళ్యాణ్ (జనసేన)
==> గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ)
==> జ్యోతుల నెహ్రు (టీడీపీ )
==> పంతం నానాజి (జనసేన)
==> ఆదిరెడ్డి శ్రీనివాస్ (టీడీపీ )
పశ్చిమ గోదావరి జిల్లా
==> రఘురామరాజు (టీడీపీ)
==> నిమ్మల రామానాయుడు (టీడీపీ)
==> బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన)
==> చింతమనేని ప్రభాకర్ (టీడీపీ)
ప్రకాశం జిల్లా
==> గొట్టిపాటి రవికుమార్ (టీడీపీ)
==> ఏలూరి సాంబశివరావు (టీడీపీ)
కర్నూల్ జిల్లా
==> భూమా అఖిలప్రియ (టీడీపీ)
==> కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి (టీడీపీ)
==> ఫరూఖ్ (టీడీపీ)
==> కేఈ శ్యామ్ బాబు (టీడీపీ)
అనంతపురం జిల్లా
==> నందమూరి బాలకృష్ణ (టీడీపీ)
==> సత్యకుమార్ (బీజేపీ )
==> పయ్యావుల కేశవ్ (టీడీపీ)
==> పరిటాల సునీత (టీడీపీ )
==> కాల్వ శ్రీనివాస్ (రాయదుర్గం)
కడప జిల్లా
==> ఆదినారాయణ రెడ్డి (బీజేపీ )
==> పుట్టా సుధాకర్ యాదవ్ (టీడీపీ)
==> వరదరాజుల రెడ్డి (టీడీపీ)
చిత్తూరు జిల్లా
==> నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (టీడీపీ)
==> ఆరణి శ్రీనివాస్ (జనసేన)
గమనిక: ఇది ప్రభుత్వ అధికారిక ప్రకటన కాదు. లిస్టులో వీరి పేర్లు మాత్రమే ఉంటాయని కాదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం చర్చించి.. మంత్రల లిస్ట్ ఫైనలైజ్ చేయనుంది. జాబితాలో మార్పులు, చేర్పులు ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter