Add Zee Business As A Preferred Source
App

HBD Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్..

Written ByTA Kiran KumarUpdated byTA Kiran Kumar
Published: Jun 09, 2024, 06:16 PM IST|Updated: Jun 09, 2024, 06:16 PM IST

HBD Balakrishna: నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో అన్న నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు తెలుగులో తొలి నట వారసుడిగా స్టార్ గా సత్తా చూపెట్టిన తొలి హీరోగా రికార్డులకు ఎక్కాడు. అంతేకాదు ఓ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి 50 యేళ్లుగా స్టార్ హీరోగా సత్తా చూపెడుతున్న తొట్ట తొలి భారతీయ హీరోగా రికార్డుల ఎక్కాడు. ఈయన కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..

NBK Top 10 Movies1/11

బాలయ్య టాప్ టెన్ చిత్రాలు.. బాలయ్య కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ చిత్రాలున్నాయి. అందులో టాప్ టెన్ చిత్రాల విషయానికొస్తే..

Akhanda2/11

అఖండ.. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ బాలయ్య కెరీర్ లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.

Legend3/11

లెజెండ్..

బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో వచ్చిన రెండో చిత్రం ‘లెజెండ్’. ఈ సినిమా కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Simha4/11

సింహా..

బాలయ్య పనైపోయిందన్న సమయంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింహా’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సింహ గర్జన చేసాడు.

Narasimha Naidu5/11

నరసింహనాయుడు బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘నరసింహనాయుడు’. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే కాదు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

 

Samara Simha Reddy6/11

సమరసింహా రెడ్డి

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సమరసింహారెడ్డి’. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ చిత్రాల్లో ఇదో ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది.

Bhairava Dweepam7/11

భైరవ ద్వీపం (Bhairava Dweepam)

జానపదాలు కనుమరుగు అవుతున్న  సందర్బంలో బాలయ్య రాకుమారుడిగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  ‘భైరవ ద్వీపం’. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో ఢిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. 

Rowdy Inspector8/11

రౌడీ ఇన్ స్పెక్టర్

బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన  చిత్రం ‘రౌడీ ఇన్ స్పెక్టర్’. తెలుగులో పోలీస్ బ్యాక్ డ్రాప్  చిత్రాల్లో ఈ సినిమాకు తప్పక స్థానం ఉంటుంది.

Aditya 3699/11

ఆదిత్య 369

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ శ్రీ కృష్ణ దేవరాయలుగా, కృష్ణకుమార్ గా రెండు విభిన్న పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆదిత్య 369’. అంతేకాదు తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ మూవీగా ఈ సినిమా రికార్డులకు ఎక్కింది. ఈ చిత్రం పలు రికార్డులను బద్దలు కొట్టింది.

Muddula Mavayya10/11

ముద్దుల మావయ్య

కోడి రామకృష్ణ దర్శకత్వంలో భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ లో నిర్మించిన చిత్రం ‘ముద్దుల మావయ్య’. తెలుగులో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Mangamma Gari Manavadu11/11

మంగమ్మ గారి మనవడు

భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ తో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మంగమ్మ గారి మనవడు’. ఈ  సినిమాతో బాలయ్య తొలి సోలో హిట్ గా నిలిచింది. అంతేకాదు తొలి బ్లాక్ బస్టర్, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ చిత్రంగా రికార్డులకు ఎక్కింది.