Sreeleela: శ్రీలీల అభిమానులకు క్లారిటీ.. టిల్లు స్క్వేర్ అందుకే ఒప్పుకోలేదా…!

Tillu Square: టాలీవుడ్ లో లేటెస్ట్ క్యూట్ బ్యూటీ శ్రీలీల.. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఆగ్ర హీరోల సరసన మూవీలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే కెరీర్ ప్రారంభ దశ నుంచి శ్రీలీల ఒక ప్రిన్సిపల్ కి కంప్లీట్ గా ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ మూవీ ట్రెండ్ లో ఆమె తీసుకున్న డెసిషన్ చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2024, 12:43 PM IST
Sreeleela: శ్రీలీల అభిమానులకు క్లారిటీ.. టిల్లు స్క్వేర్ అందుకే ఒప్పుకోలేదా…!

Sreeleela: శ్రీలీల గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ లో ఎటువంటి పరిచయాలు అవసరం లేదు. చేసింది కొన్ని సినిమాలు అయినప్పటికీ స్టార్ హీరోయిన్ స్టేటస్ తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల.. రవితేజ ధమాకా చిత్రంతో తన మొదటి తెలుగు సక్సెస్ అందుకుంది. మూవీస్ విషయంలో శ్రీ లీల ఎంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. అలాగే సినిమాకు సంబంధించి ఆమె ఒక ప్రిన్సిపల్ ని కచ్చితంగా ఫాలో అవుతుంది. కొంతమందికి విడ్డూరంగా ఉన్న ఎంతోమంది ఆమెను ఈ విషయానికి తెగ మెచ్చుకుంటున్నారు.

ఇంతకీ సంగతేమిటంటే ఈమధ్య విడుదలైన టిల్లు స్క్వేర్ ట్రైలర్.. యూత్ ను బాగా ఆకట్టుకుంది. మొదటి పార్ట్ కంటే కూడా రెండవ పార్ట్ మరింత అద్భుతంగా ఉంది అని చాలామంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిద్దు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్ , పంచ్ డైలాగ్స్ తో పాటు యూత్ కు కావలసిన రొమాంటిక్ ఎలిమెంట్స్ కూడా ఈ చిత్రంలో ఎక్కువగా ఉంది. వీటితో పాటుగా ఈ సినిమాలో ఘాటైన ముద్దు సీన్లు కూడా కావలసినన్నే ఉన్నాయి. మొత్తానికి ట్రైలర్ చిత్రంపై అంచనాలను భారీగా పెంచింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది.

అసలు పాయింట్ ఏమిటంటే.. టిల్లు స్క్వేర్ చిత్రానికి ముందుగా అనుకున్న హీరోయిన్ శ్రీలీల. కొన్ని సీన్స్ షూటింగ్ కూడా జరిగిన తర్వాత.. ఇక మూవీ కొనసాగించలేను అని శ్రీ లీల తప్పుకోవడంతో హీరోయిన్గా ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదట్లో అనుపమ కూడా వెంటనే ఓకే చెప్పలేదట.. కాస్త టైం తీసుకున్నాక ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ మూవీకి శ్రీ లీల నో చెప్పడం వెనుక అసలు కారణం ఏమిటి అన్న విషయం ట్రైలర్ లో అందరికీ స్పష్టంగా అర్థమైంది.

ఈ మూవీలో సుదీర్ఘమైన లిప్ లాక్ సన్నివేశాలు ఎక్కువ ఉన్నట్లు అర్థమవుతుంది. మూడు నిమిషాల వీడియో ఇంత ఘాటుగా ఉంటే మరి ఫుల్ సినిమా ఏ రేంజ్ రోమాంటిక్ యాంగిల్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటువంటి సన్నివేశాలు చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి శ్రీలీల టిల్లు స్క్వేర్ వద్దనుకుని ఉంటుంది అన్న చర్చ జరుగుతుంది. అగ్ర హీరోల సరసన నటించిన్నపటికి శ్రీ లీల ఇప్పటివరకు అవసరానికి మించి ఎక్స్పోజింగ్ చేయడం లేక లిప్ లాక్ సీన్స్ లో నటించడం చేయలేదు. పైగా ఆమె ఎటువంటి సన్నివేశాలు చేయను అన్న విషయం ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాని వదులుకోవడంతో ఆమె తన ప్రిన్సిపుల్స్ ను ఎంతగా ఫాలో అవుతుందో అందరికీ మరొకసారి అర్థం అవుతుంది.

Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే

Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News