Sreemukhi New Show : దుమ్ములేపుతున్న శ్రీముఖి.. వెరైటీ ఆటలతో రాములమ్మ.. అనిల్ రావిపూడి నయా లుక్

Sreemukhi Mister And Misses Show బుల్లితెరపై వినోదాన్ని కోరుకునే ప్రేక్షక వర్గం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. బుల్లితెరపై వినోదాన్ని అందించడంలో ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వంటి చానెళ్లు ముందు వరుసలో ఉంటాయి

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2022, 04:02 PM IST
  • బుల్లితెరపై మరో కొత్త షో ఎంట్రీ
  • సందడి చేయబోతోన్న శ్రీముఖి
  • బుల్లితెరపైకి అనిల్ రావిపూడి
Sreemukhi New Show : దుమ్ములేపుతున్న శ్రీముఖి.. వెరైటీ ఆటలతో రాములమ్మ.. అనిల్ రావిపూడి నయా లుక్

Sreemukhi New Show : ప్రస్తుతం బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా పోయింది. ఆడియెన్స్‌కు ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరికితే అక్కడే వాలిపోతోన్నారు. కరోనా సమయంలో అయితే బుల్లితెరకు మరింత ఆదరణ పెరిగింది. బుల్లితెరపై కొత్త కొత్త షోలు వస్తూనే ఉన్నాయి. చానెళ్ల మధ్య పోటీ పెరుగుతూనే ఉంది. నిర్మాణ సంస్థలు కొత్త కొత్త షోలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందులో జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్‌ ముందుంటుంది. ఆలీతో సరదాగా షోకు ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే.

‘వావ్‌’,‘పాడుతా తీయగా’, ‘స్వరాభిషేకం’ వంటి అనేక షోలతో పాటు పండగల పూట ప్రసారమయ్యే స్పెషల్‌ షోలను డిజైన్‌ చేసి దర్శకత్వం వహించారు అనిల్‌ కడియాల. ఈ షోలన్నింటికి కంటెంట్‌ పార్టును దగ్గరుండి చూసుకుంటూ నిర్మాతగా వ్యవహరించే వ్యక్తే ప్రవీణా కడియాల. నిర్మాత–దర్శకులిద్దరూ భార్య,భర్తలు కావటంతో ఇలా వారు చేసే ప్రతీ షో మంచి ఆదరణను దక్కించుకుంటోంది.

ప్రస్తుతం వీరి కాంబోలోనే మరో కొత్త షో రాబోతోంది.  ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’  ఒకరికి ఒకరు అనే ట్యాగ్‌లైన్‌తో సరికొత్తగా షోను డిజైన్‌ చేసి పది సెలెబ్రిటీ జంటలతో  ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.  ఈ మేరకు నిర్మాత మాట్లాడుతూ.. ఈటీవిలో అక్టోబర్‌ 11న ప్రారంభం అవుతుంది మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ఒకరికి ఒకరు.  ప్రతి మంగళవారం రాత్రి 9–30నిమిషాలకు ప్రసారం కానున్న ఈ షోద్వారా ప్రముఖ నటి స్నేహ తొలిసారి జడ్జిగా వ్యవహరిస్తుండటం విశేషం. 

స్నేహతో పాటు నటుడు శివబాలాజి ఒక జడ్జిగా వ్యవహరిస్తుండగా బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా నిలిచి ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ స్లోగన్‌ను తెలుగువారికి పరిచయం చేసిన దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పెషల్‌ జడ్డిగా వ్యవహరించటం ఈ షోకే హైలెట్‌. ఈ షోలో పాల్గొంటున్న పది జంటలకు రకారకాల టాస్క్‌లు ఉంటాయి. ఆ టాస్క్‌ల్లో విజేతగా నిలిచిన వారు ఫైనల్‌కి వెళ్లి గ్రాండ్‌ ఫినాలే టైటిల్‌తో పాటు భారీ ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంటారు అని చెప్పుకొచ్చారు.

మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ పోటీలో పాల్గొంటున్న పదిజంటలు..1. రవికిరణ్‌–సుష్మా 2. పవన్‌–అంజలి 3. సందీప్‌–జ్యోతి 4. హ్రితేష్‌–ప్రియా 5. శ్రీవాణి–విక్రమ్‌ 6. మధు–ప్రియాంక 7. ప్రీతమ్‌–మానస 8. సిద్దు–విష్ణుప్రియ 9. రాకేశ్‌–సుజాత 10. విశ్వ–శ్రద్ధ ఈజంటలందరూ బుల్లితెరపై అందరికి సుపరిచితులే.  అనేక సందర్భాల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నవారే. ఈ అందరినీ కలుపుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌తో మాస్‌ అభిమానులను సొంతం చేసుకున్న లేడి మాస్‌ స్టార్‌ శ్రీముఖి ఈ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News