Om Bheem bush OTT Streaming: నేటి నుంచి ప్రముఖ ఓటీటీలోకి 'ఓం భీమ్ బుష్' మూవీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..

Om Bheem bush OTT Streaming: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఓం భీమ్ బుష్'. థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శించ బడింది. అంతేకాదు నిర్మాతలకు మంచి లాభాలను తీసుకొచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 12, 2024, 08:59 AM IST
Om Bheem bush OTT Streaming: నేటి నుంచి ప్రముఖ ఓటీటీలోకి  'ఓం భీమ్ బుష్' మూవీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..

Om Bheem bush OTT Streaming: గతేడాది 'సామజవరగమన' వంటి సాలిడ్ హిట్‌తో దూకుడు మీదున్న శ్రీ విష్ణు తాజాగా  'ఓం భీమ్ బుష్' మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఇతర పాత్రల్లో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించారు. హార్రర్ కామెడీ ఎంటర్టైనర్‌గా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ప్రీమియర్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ముందుగా ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్‌కు వస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా నేటి నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమాలో అయేషా ఖాన్ కథానాయికగా నటించింది. సన్ని వీఆర్ సంగీతం అందించారు. వి సెల్యూలాడ్ పై ఈ సినిమా తెరకెక్కింది. 'ఓం భీమ్ బుష్' మూవీ శ్రీ విష్ణు కెరీర్‌లో మరో హిట్‌గా నిలిచింది.  ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 9.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమాను మొత్తంగా రూ. 10 కోట్ల షేర్.. (రూ. 18 కోట్ల వరకు గ్రాస్) వసూళ్లను రాబట్టింది. మొత్తంగా టిల్లు స్క్వేర్ రాకతో ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది. మొత్తంగా అనుకున్న టైమ్ కంటే ముందే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మరి థియేటర్స్‌లో సినిమా  చూడని ప్రేక్షకులు ఇపుడు ఎంచక్కా ఓటీటీలో చూడొచ్చు.

Also Read: KT Rama Rao: కాంగ్రెస్‌ అభ్యర్థిపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. 'పనికి రాని చెత్త'గా అభివర్ణన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News