Avatar 2 Telugu Dialogue అవసరాల శ్రీనివాస్ నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తన సత్తాను చాటుకున్నాడు. ఇక అవసరాల తెరకెక్కించే సినిమాలు ఎంత సున్నితంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. సహజమైన సున్నిత భావోద్వేగాలను అల్లుకుని కథను రాసుకుంటాడు. ఇక ఆయన తీసిన ఊహలు గుసగుసలాడే సినిమా నాగ శౌర్యకు మంచి పేరును తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదే కాంబోలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి రాబోతోండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు వ్యవహరిస్తున్నారు.
ఈ మూవీ మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ క్రమంలో సినిమా విశేషాలను పంచుకునేందుకు శ్రీనివాస్ అవసరాల మీడియా ముందుకు వచ్చాడు. నిజంగా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో అంత సహజంగా ఉండాలని తీసిన సినిమా ఇదని, అందుకే ఇలాంటి ఓ సహజంగా ఉండే టైటిల్‌ను పెట్టినట్టు చెప్పుకొచ్చాడు.
నిజ జీవితంలో పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయి, ఎలా మాట్లాడుతారో అలాగే ఈ సినిమా ఉంటుందని, అసలు ఈ సినిమాలో ఏం కొత్త దనం ఉందనే విషయం సినిమా చూసిన తరువాతే తెలుస్తుందని ధీమాగా తెలిపాడు. 2019లో మొదలుపెట్టాడట. కానీ కరోనా వల్ల మధ్యలో సినిమా ఆగిందని, ఇప్పటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని తెలిపాడు.
తాను ముందుగా కథ రాస్తానని, ఆ తరువాత నటీనటులను వెతుకుతానని పేర్కొన్నాడు. ఈ సినిమాలో ఏడు చాప్టర్లుంటాయని, ఒక్కో చాప్టర్ దాదాపు 20 నిమిషాలు ఉంటుందని తెలిపాడు. బ్రహ్మాస్త్రకు సినిమాకు తెలుగు డైలాగ్స్ రాస్తారా? అని అడిగారట. ఆ సినిమా గురించి ముందే తెలియడం, నాగార్జున నటిస్తున్నాడని తెలియడంతో రాస్తానని అన్నాడట.
పెద్ద సినిమా, ఎక్కువమంది చేరువయ్యే సినిమా కావడంతో వెంటనే రాయడానికి అంగీకరించాడట. అలా బ్రహ్మస్త్ర సినిమాకు రాయడం, అది చూసిన తరువాతే తనకు అవతార్ 2 రాసేందుకు చాన్స్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. ఛాలెంజింగ్‌గా తీసుకుని అవతార్-2కి డైలాగ్స్ రాశానని అన్నాడు.
Also Read: Priyadarshi Balagam : బలగం ఆమెకే అంకితం.. అమ్మ కాదు అత్తమ్మ.. ప్రియదర్శి ఎమోషనల్ పోస్ట్
Also Read: Shruti Hassan Knee Injury : శ్రుతి హాసన్ మోకాళ్లకు గాయం.. నెటిజన్ల సెటైర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook