Akhanda pre-release: బాలయ్య ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​- అఖండ ప్రీ రిలీజ్​కు స్పెషల్​ గెస్ట్ ఎవరంటే..

Akhanda pre-release: నందమూరి నట సింహం బాలకృష్ణ ఫ్యాన్స్​కు మరో సర్​ప్రైజ్ ఇచ్చింది అఖండ సినిమా యూనిట్​. ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు అల్లు అర్జున్​తో పాటు మరో ప్రత్యేక అతిథి వస్తున్నట్లు తెలిపింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 08:05 AM IST
  • నేడు బాలయ్య అఖండ ప్రీ రిలీజ్​ ఈవెంట్​
  • ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్ ఇచ్చిన చిత్ర యూనిట్​
  • ప్రత్యేక అతిథిగా ప్రముఖ దర్శకుడు
Akhanda pre-release: బాలయ్య ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​- అఖండ ప్రీ రిలీజ్​కు స్పెషల్​ గెస్ట్ ఎవరంటే..

Special Guest for Akhanda pre-release: వచ్చే నెల 2న థియేటర్లలో విడుదలకు సిద్ధమైన బాలయ్య 'అఖండ' సినిమాపై ఫ్యాన్స్​ భారీ అంచనాలు (Akhanda release date) పెట్టుకున్నారు. సినిమా రిలీజ్​కు ముందు ప్రీ రిలీజ్​ ఈవెంట్​ కూడా ఫ్యాన్స్​కు మంచి కిక్కివ్వనుంది.

హైదరాబాద్​లోని శిల్పకలా వేదికగా నేడు (నవంబర్ 27 శనివారం) ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ (Akhanda Pre Releas event) రానున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ ఇటు నందమూరి ఫ్యాన్స్​ను, అటు మెగా ఫ్యాన్స్​కు (Balayya- Bunny) పండగనే చెప్పాలి.

అయితే ఈవెంట్​కు సంబంధించి మరో సర్​ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. దర్శక ధీరుడు ఎస్​ఎస్​ రాజమౌలి ఈ ఈవెంట్​కు ప్రత్యేక అతిథిగా (Rajamouli as special guest for Akhanda pre-release) రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనితో ఈ సాయంత్రం అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడిగా మారనుంది.

అఖండ సినిమా విశేషాలు..

బోయపాటి శ్రీను(Boyapati Sreenu), బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇంతకు ముందు వీరు కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్​గా నిలిచాయి. దీనితో మూడో సినిమాతో వీరు హ్యాట్రిక్ కొడతారని భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.

ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్​ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్ విలన్​గా చేశారు. జగపతిబాబు కీలక పాత్ర పోషించారు.

Also read: chiranjeevi: మరోసారి పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి...శివశంకర్ కుటుంబానికి ఆర్థిక సాయం

Also read: Samantha calls 2021 rough : 2021 సంవత్సరం చాలా రఫ్‌ అంటోన్న సమంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News