ఎస్ఎస్ రాజమౌళి ( SS Rajamouli ) తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం కోసం మూడు భారతీయ చలన చిత్ర పరిశ్రమల నుండి ముగ్గురు సూపర్ స్టార్లను తీసుకోవాలని యోచిస్తున్నట్లు గతంలో తెలిపారు. కాని ఆ ప్రాజెక్ట్ వెంటనే సెట్స్‌పైకి వెళ్లలేదు. ప్రస్తుతం జూనియర్ ఎన్.టి.ఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ( RRR movie shooting ) జరుగుతోంది. Also read : OTT పై యాంకర్ ప్రదీప్ సినిమా ?
తాను మహాభారతం ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన ఎస్ఎస్ రాజమౌళి.. అలాంటి సినిమా తీయడానికి ఇంక కొంత అవగాహన, పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి అన్నారు. అలాగే కొంతకాలం క్రితం అమీర్ ఖాన్‌ని కూడా కలిశానని, మహాభారతం గురించి మాట్లాడాము అని, అతను కూడా ఈ సినిమా చేయడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నాడని, కానీ ప్రస్తుతం ఈ సినిమా గురించి ఆలోచించడం లేదు అని తెలిపారు. మహాభారతం ( Mahabharat ) లాంటి గొప్ప ఇతిహాసాన్ని వెండితెరపైకి తెరకెక్కించడానికి తనకు కనీసం 10 సంవత్సరాలు అయినా పడుతుంది అని చెప్పుకొచ్చారు. Also read : Bigg Boss 4: జబర్ధస్త్ ఫేమ్ ఆర్టిస్టులకు ఆ ఒక్క ఛాన్స్ ?
ఎస్ఎస్ రాజమౌళి మహాభారతం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుందని.. ఈ కథని 6 లేదా 7 భాగాలుగా సినిమా చేస్తానని చెప్పారు. అలాగే మహాభారతం భారతదేశపు అతిపెద్ద చలనచిత్ర ఫ్రాంచైజీ అవుతుందని చెప్పిన రాజమౌళి.. ఈ చిత్రం చివరి భాగం 2040లో థియేటర్లలోకి రావచ్చు అని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా జక్కన్న డ్రీం ప్రాజెక్ట్ అయిన మహాభారతాన్ని మొత్తం చూడాలంటే 20 సంవత్సరాలు ఆగాల్సిందే. Also read : Adipurush: సీత పాత్రకు హీరోయిన్ ఖరారు ?