Staff Mobile phone cameras covered with Red stickers in Ranbir Kapoor-Alia Bhatt wedding: బాలీవుడ్ తారలు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌లు మరికొన్ని గంటల్లో వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. వారిద్దరు గురువారం పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కపూర్, మహేశ్ భట్ కుటుంబసభ్యుల సమక్షంలో జరగనున్న ఈ పెళ్లి వేడుకల్లో అత్యంత సన్నిహితులు, ఇండస్ట్రీ నుంచి కొద్దిమంది మాత్రమే హాజరు కానున్నారు. ప్రీ వెడ్డింగ్ సంబంధించిన సెలబ్రేషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పెళ్లి వేడుకల్లో భాగంగా గణపతి పూజను ఉదయం వాస్తు అపార్ట్‌మెంట్‌లో నిర్వహించగా.. సాయంత్రం హల్దీ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.
పెళ్లి వేడుకలను రణ్‌బీర్ తల్లి నీతూకపూర్, సోదరి రిద్ధిమా కపూర్.. మహేశ్ భట్ కుటుంబసభ్యులు దగ్గరుండి తీసుకుంటున్నారు. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ల పెళ్లికోసం రణబీర్ సోదరిమనులు కరిష్మా కపూర్, కరీనా కపూర్ వచ్చారు. ఎంబ్రాయిడరీ చేసిన తెల్లటి లెహంగాలో కరీనా రాగా.. ఎంబ్రాయిడరీ ఉన్న అనార్కలీ డ్రెస్‌లో తళుక్కుమన్నారు. ఇక చిత్ర నిర్మాత కరణ్ జోహార్ పసుపు రంగు కుర్తాలో వచ్చారు. నిశ్చితార్థం తర్వాత మెహందీ వేడుక జరగనున్నట్లు సమాచారం. వీరి పెళ్లి రేపు మధ్యాహ్నం జరగనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు తీసుకునేందుకు వీలులేకుండా.. ఆలియా-రణ్‌బీర్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. పెళ్లి వేడుకల్లో విధులు నిర్వర్తించనున్న వారికి సెల్‌ఫోన్ల కెమెరాలకు ఎరుపు రంగు స్టిక్కర్లు అతికించారట. వేడుకల నుంచి బయటకు వచ్చే వరకూ వాటిని ఎవరూ తీయకూడదని ఆదేశాలు జారీ చేశారట.
చిన్ననాటి నుంచి మంచి స్నేహితులైన రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్.. బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఈ లవ్ బర్డ్స్ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తమ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఖాళీ దొరికితే పబ్, పార్టీ, పెళ్లిళ్లకు జంటగా హాజరయ్యారు. నూతన సంవత్సర వేడుకలకు కూడా ఈ ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్లారు. ఎవరి ఇంట్లో ఫంక్షన్ ఉన్నా.. వారు హాజరయ్యేవారు. గతేడాది డిసెంబర్ మాసంలో ప్రేమికులు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌లు పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడంతో రణ్‌బీర్-అలియా ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారాని అందరూ ఆసక్తిగా చూశారు. ఎట్టకేలకు వారిద్దరూ రేపు పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు.
Also Read: Rohit Sharma: మరో 25 పరుగులే.. టీ20 చరిత్రలో అరుదైన రికార్డు అందుకోనున్న రోహిత్ శర్మ!
Also Read: AC Cooling Problem: సమ్మర్ లో ఏసీ కూలింగ్ పెరగాలంటే ఈ చిట్కాలు కచ్చితంగా పాటించండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook