Harom Hara Collections: హరోం హర బ్రేక్ ఈవెన్ సాధించిందా? టాక్ కి కలెక్షన్లకి సంబంధమే లేదుగా!

Harom Hara: హీరో సుధీర్ బాబు.. నవ దళపతి అనే పేరు.. కూడా పెట్టుకుని హరోం హర.. అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సినిమా విడుదలకి ముందు వరకు మంచి హైప్ ఉన్న ఈ సినిమా.. విడుదలయ్యాక కూడా.. మంచి రివ్యూస్ ని అందుకుంది. మరి ఈ సినిమా కలెక్షన్ లు ఎలా.. ఉన్నాయో చూసేద్దామా.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 21, 2024, 08:00 PM IST
Harom Hara Collections: హరోం హర బ్రేక్ ఈవెన్ సాధించిందా? టాక్ కి కలెక్షన్లకి సంబంధమే లేదుగా!

Harom Hara Break Even Details: ప్రేమ కథ చిత్రం, భలే మంచి రోజు, వంటి సినిమాలతో.. మంచి పేరు తెచ్చుకున్న.. యంగ్ హీరో సుధీర్ బాబు.. తాజాగా నవ దళపతి అనే కొత్త బిరుదు పెట్టుకున్నాడు. హరోం హర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న సుదీర్ బాబు.. ఈ సినిమా మీదే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. 

నిజానికి ఈ సినిమాకి టాక్ మంచిగానే వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం ఆశాజనకంగా.. లేవు. గతేడాది సుధీర్ బాబు.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. ఆ రెండు సినిమాలతో పోలిస్తే హరోం హర సినిమా టాక్ పర్వాలేదు అనిపించుకుంది. 

సినిమా బ్లాక్ బస్టర్ అని అనకపోయినప్పటికీ చాలా బాగుంది అని..మంచి కంటెంట్ ఉంది అని అందరూ కామెంట్లు చేశారు. ఒకవైపు రివ్యూలు ఒకలా ఉంటే.. కలెక్షన్లు మాత్రం మరొకలా ఉన్నాయి. మొదటి మూడు రోజులు బాగానే కలెక్షన్లు అందుకున్న ఈ సినిమా.. సోమవారం నుంచి భారీగా పడిపోయింది. 

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం హరోం హరా సినిమా సేఫ్ జోన్ లోకి రావాలంటే ఇక 6.5 కోట్ల షేర్ ను నమోదు చేసుకోవాలి. కానీ మరొకవైపు సినిమా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు.. కలెక్షన్ల గురించిన ఫిగర్స్ బయటకు రానివ్వడం లేదు. మొదటి రెండు మూడు రోజులు కలిపి కోటికి పైగానే గ్రాస్ వచ్చింది కానీ సోమవారం నుంచి కలెక్షన్లు బాగా పడిపోయాయి.
మరోవైపు మహారాజా పోటీ గట్టిగానే.. ఉంది. అంతేకాకుండా సినిమా విడుదలయ్యాక పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు కూడా చేయకపోవడం సినిమాకి మైనస్ అయింది. ఎంత కలెక్షన్లు బాగానే ఉన్నప్పటికీ సినిమా బ్రేక్ ఈవెన్ దాకా వెళ్లి ఆగిపోయి ఉంటుందని చెప్పుకోవచ్చు.

Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో

Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News