Maama Mascheendra OTT: రిలీజైన రెండు వారాలకే ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న 'మామా మ‌శ్చీంద్ర'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mama Machindra Movie: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు లీడ్ రోల్ లో నటించిన సినిమా ‘మామ మశ్చీంద్ర’ . హర్షవర్థన్‌ తెరకెక్కించిన ఈ మూవీ రెండు వారాల్లోనే ఓటీటీ ఎంట్రీకి సిద్దమైంది.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2023, 08:37 PM IST
Maama Mascheendra OTT: రిలీజైన రెండు వారాలకే ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న 'మామా మ‌శ్చీంద్ర'..  స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mama Machindra OTT Release date: సుధీర్‌బాబు త్రిబుల్ రోల్‌లో నటించిన మూవీ 'మామా మ‌శ్చీంద్ర'(Maama Mascheendra Movie) . డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబ‌ర్ 6న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌ దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని  అక్టోబరు 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. 

హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వహించిన మామా మ‌శ్చీంద్ర సినిమాలో ఈషారెబ్బా, మృణాళిని హీరోయిన్లుగా న‌టించారు. ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో తెరకెక్కిన ఈ మూవీ రిలీజైన రోజు నుంచి నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. అయితే సుధీర్ బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి. కథలో క‌న్ఫ్యూజ‌న్ ఎక్కువ ఉండటం, స‌రైన ప్ర‌మోష‌న్స్ చేయకపోవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. భావోద్వేగాలు కొరవడటం, సాంగ్స్ ఈ సినిమాకు మైనస్. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, అజయ్, మిర్చి కిరణ్, అలీ రాజా, హరితేజ తదితరలు కీలకపాత్రలు పోషించారు.

చిత్రం: మామ మశ్చీంద్ర 
నటీనటులు: సుధీర్‌బాబు, ఈషారెబ్బ, మృణాళిని రవి, హర్షవర్థన్‌, అలీ రెజా, రాజీవ్‌ కనకాల
సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌ 
నేపథ్య సంగీతం: ప్రవీణ్ లక్కరాజు 
ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె వెంకటేశ్‌
సినిమాటోగ్రఫీ: పి.జి.విందా
నిర్మాత: సునీల్‌ నారంగ్‌, పుష్కర్‌ రామ్మోహన్‌రావు
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ
రచన, దర్శకత్వం: హర్ష వర్థన్‌
విడుదల: 06-10-2023

Also Read: Mark Antony OTT: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న విశాల్ 'మార్క్ ఆంటోనీ'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News