Pushpa villain: పుష్ప విలన్‌గా బాలీవుడ్ నటుడు

Bollywood actor in Pushpa movie villain role: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం అయిన ‘పుష్ప’ సినిమాని 2019 డిసెంబర్‌లో అనౌన్స్ చేశారు. దాదాపు 11 నెలల తరువాత, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో నవంబర్ 10 న పుష్ప సినిమా షూటింగ్ ( Pushpa shooting ) ప్రారంభం కానుంది.

Last Updated : Nov 7, 2020, 06:16 AM IST
Pushpa villain: పుష్ప విలన్‌గా బాలీవుడ్ నటుడు

Bollywood in Pushpa movie villain role: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం అయిన ‘పుష్ప’ సినిమాని 2019 డిసెంబర్‌లో అనౌన్స్ చేశారు. దాదాపు 11 నెలల తరువాత, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో నవంబర్ 10 న పుష్ప సినిమా షూటింగ్ ( Pushpa shooting ) ప్రారంభం కానుంది. ఈ చిత్ర బృందం ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ వచ్చే వారం నుంచి పుష్ప షూటింగ్‌కి హాజరు కానున్నారు.

అయితే డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాలో విలన్‌ని ఇంకా ఖరారు చేయలేదు. మొదట విలన్ పాత్రకు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ( Vijay Sethupathi ) పేరు వినిపించింది. కానీ వేరే సినిమాలతో బిజీగా ఉండి డేట్స్ కుదరకపోవడంతో ఈ తమిళ స్టార్ తప్పుకున్నాడు. ఆ తరువాత నారా రోహిత్, మరో ఇద్దరు కన్నడ నటుల పేర్లు ఈ పాత్ర కోసం వినిపించాయి కానీ అవేవీ కూడా కార్యరూపం దాల్చలేదు. Also read : Prayaga Martin: ఒక్క రోజు షూట్ తర్వాత హీరోయిన్‌కి నో చెప్పిన బోయపాటి

ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ ( Director Sukumar ) కొంతమంది బాలీవుడ్ నటులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒక సీనియర్ బాలీవుడ్ హీరో ఈ సినిమాలో విలన్‌గా నటించడానికి సుకుమార్ చర్చలు జరుపుతున్నాడని సమాచారం.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ‘పుష్ప’ చిత్రం ( Pushpa movie ) చిత్తూరు ప్రాంతంలో రెడ్ శాండల్ స్మగ్లింగ్ అంశంపై ఉండబోతోంది. అల్లు అర్జున్ ( Allu Arjun ) ఈ సినిమాలో ఒక ట్రాన్స్‌పోర్టర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘రంగస్థలం’ సినిమా ( Rangasthalam ) తర్వాత సుకుమార్‌కి ఇదే మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Also read :Vakeel Saab shooting: శృతి హాసన్ వకీల్ సాబ్ షూటింగ్‌ అప్పుడే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News