Vakeel Saab shooting: శృతి హాసన్ వకీల్ సాబ్ షూటింగ్‌ అప్పుడే

Shruti Haasan in Vakeel Saab: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్‌కి హాజరవుతున్నాడు. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ జంటగా నటిస్తోంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్‌తో కలిసి శృతి హాసన్ ‘గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ వంటి చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ పింక్ సినిమా ( Pink movie ) ఒరిజినల్ రీమేకే వకీల్ సాబ్ సినిమా అని తెలిసిందే.

Last Updated : Nov 7, 2020, 06:12 AM IST
Vakeel Saab shooting: శృతి హాసన్ వకీల్ సాబ్ షూటింగ్‌ అప్పుడే

Shruti Haasan in Vakeel Saab: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్‌కి హాజరవుతున్నాడు. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ జంటగా నటిస్తోంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్‌తో కలిసి శృతి హాసన్ ‘గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ వంటి చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ పింక్ సినిమా ( Pink movie ) ఒరిజినల్ రీమేకే వకీల్ సాబ్ సినిమా అని తెలిసిందే. అయితే బాలీవుడ్ పింక్ సినిమాలో కానీ, తమిళ్ రీమేక్‌లో కానీ హీరో లవ్ ట్రాక్ సీన్స్ లేవు, కానీ తెలుగు ఆడియెన్స్ అభిరుచికి తగినట్టుగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లవ్ ట్రాక్ సీన్స్ ఉండేలా ఈ చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ సినిమాలో శృతి హాసన్ పాత్ర కొంతసేపు మాత్రమే ఉండబోతోంది అని టాక్. Also read: Pushpa villain: పుష్ప విలన్‌గా బాలీవుడ్ నటుడు

అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే వకీల్ సాబ్ ( Vakeel Saab ) తదుపరి షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు శ్రుతి హాసన్ ( Shruti Haasan ) షూటింగ్‌లో  పాల్గొననున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన సన్నివేశాలను డైరెక్టర్ వేణు శ్రీరామ్ చిత్రీకరిస్తున్నారు. వకీల్ సాబ్ ప్రస్తుత షెడ్యూల్ వచ్చే వారం వరకు జరగనుంది అని తెలుస్తోంది.

ఈ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వకీల్ సాబ్ సినిమాలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగల్ల, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తోన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన 'మగువ మగువ..' పాట ( Maguva maguva song ) మగువలతో పాటు మగాళ్ల మనసు కూడా దోచేసింది.  Also raed : Samantha hosting Sam Jam: 'సామ్ జామ్' అంటున్న సమంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News