మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో తొలి చారిత్రక చిత్రంగా రూపొందిన 'సైరా' మూవీని పరిచయం చేసే ట్రైలర్ యూ ట్యూబ్ లో దూసుకుపోతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ ట్రైలర్ దూసుకుపోతోంది. ఈ ట్రైలర్ యూ ట్యూబ్ ట్రెండింగులో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.
ట్రైలర్ ను వదిలిన 2 గంటల్లోనే 20 లక్షల వ్యూస్ రావడం విశేషం. ప్రస్తుతం 5 మిలియన్లకు పైగా ( 5,330,048) వ్యూస్ తో దూసుకుపోతోంది. దీంతో పాటు దీనిపై 18 వేల 403 మంది ట్రైలర్ పై స్పందించారు. ఇదే ట్రండ్ కొనసాగితే 24 గంటల్లో అంటే సాయంత్రాని కల్లా సాహో 12 మిలియన్ల రికార్డును అధిగమించవచ్చు. ఇది సైరాకు సాధ్యపడుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.
'సైరా' చిత్రం, వచ్చేనెల 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యూ ట్యూబ్ లో సైరా ట్రైలర్ దూసుకుపోతున్న తీరు చూస్తుంటే ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు.